Actress Hema : రిపోర్ట‌ర్‌ని చెడుగుడు ఆడిన హేమ‌.. డ్ర‌గ్స్ కేసులో త‌న త‌ప్పు లేద‌ట‌..?

Actress Hema : ఒక‌ప్పుడు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా సత్తా చాటిన హేమ అప్పుడ‌ప్పుడూ వివాదాల‌తో వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటోంది. ఇటీవ‌ల బంజారాహిల్స్‌లోని రాడిస‌న్ బ్లూ హోట‌ల్‌లోని ఫుడింగ్ అండ్ మింక్ ప‌బ్‌లో డ్ర‌గ్స్ బ‌య‌ట‌ప‌డ‌డం తీవ్ర సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. ఇందులో సుమారు 150 మంది సినీ, రాజ‌కీయ‌, వ్యాపార ప్ర‌ముఖుల పిల్ల‌లు ప‌ట్టుబ‌డ్డార‌నే వార్త‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. వివిధ రంగాలకు చెందిన‌ సెల‌బ్రిటీలు ప‌ట్టుబ‌డ‌డంతో కేసును నీరుగార్చే ప్ర‌య‌త్నాలు వేగ‌వంత‌మ‌య్యాయ‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. అయితే న‌టి హేమ పేరు కూడా తెర‌పైకి రావ‌డం తీవ్ర దుమారం రేపింది. అస‌లు ప‌బ్‌కే వెళ్ల‌ని త‌న‌పేరును ఏ విధంగా ప్ర‌చారంలోకి తెస్తారంటూ ఆమె ఆవేశంతో మీడియా ప్ర‌తినిధుల‌ను నిల‌దీసింది. త‌న‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్న చాన‌ళ్ల‌పై ఫిర్యాదు చేసేందుకు ఆమె బంజారాహిల్స్ పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్లారు.

Actress Hema

అస‌లు తాను అసలు పబ్‌కు వెళ్లలేద‌న్నారు. అలాంట‌ప్పుడు త‌న పేరును డ్ర‌గ్స్ కేసులో ఎలా ఇరికిస్తార‌ని ఆమె ప్ర‌శ్నించారు. డ్రగ్స్ కేసు అనేది చిన్న విషయం కాదన్నారు. త‌న‌కు కూతురు, కుటుంబం ఉంద‌ని, సంబంధం లేని విష‌యంలో దుష్ప్ర‌చారం చేయ‌డం ద్వారా ఎంత‌గా ఆవేద‌న చెందాల్సి వ‌స్తుందో అర్థం చేసుకోవాల‌ని కోరారు. కొందరు కావాలనే త‌న‌ పేరును ప్రచారం చేస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు హేమ‌. అయితే ఒక ప్రముఖ టీవీ ఛానెల్‌లో తన పేరు స్క్రోలింగ్‌ను చూసినప్పుడు ఓ జ‌ర్న‌లిస్ట్‌ని పిలిచాన‌ని హేమ చెప్పుకొచ్చింది.

సీనియర్ మోస్ట్ క్రైమ్ రిపోర్టర్ గా పేరున్న ఓ జ‌ర్న‌లిస్టును పోలీస్ స్టేష‌న్‌కు పిలిపించాన‌ని.. డ్ర‌గ్స్ కేసులో త‌న ప్ర‌మేయం ఉన్న‌ట్లు అత‌నికి ఎలా తెలిసింది.. ఎవ‌రు చెప్పారు.. వంటి వివ‌రాల‌పై క్లారిటీ ఇచ్చేందుకు స్టేష‌న్‌కు ర‌మ్మ‌ని పిలిచాన‌ని.. అయితే అత‌ను రాలేద‌ని.. పారిపోయాడ‌ని.. హేమ తెలిపారు. చూస్తుంటే త‌న‌ను కేవ‌లం అన్‌పాపుల‌ర్ చేసేందుకే ఇలా కొంద‌రు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు అర్థ‌మ‌వుతుంద‌ని అన్నారు. కేవ‌లం టీఆర్‌పీ కోసమే ఇలా చేయడం ఎంత వ‌రకు కరెక్ట్ అని న‌టి హేమ అడిగారు. అయితే ఇది న‌టి హేమ వెర్ష‌న్ అని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇందులో నిజం ఎంత ఉంది.. అన్న‌ది తెలియాల్సి ఉంది. ఇక ఈ విష‌యం సోష‌ల్ మీడియాలోనూ వైర‌ల్ అవుతోంది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM