Samantha : పదేళ్ల ప్రేమాయణం.. మూడేళ్ల వైవాహిక బంధానికి తెర దించారు నాగ చైతన్య – సమంత. క్రేజీ కపుల్‌గా అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ జంట సడెన్‌గా ఇలాంటి నిర్ణయం తీసుకోవడాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోయారు. చైతూ కంటే ఎక్కువ నెగిటివిటీని సమంతనే ఫేస్ చేస్తోంది. అందుకే విడాకుల ప్రకటన తర్వాత తన భావాలన్నీ పరోక్షంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌తో పంచుకుంటోంది సామ్. ఇటీవల తనపై వస్తున్న పుకార్లకి సుదీర్ఘ పోస్ట్ ద్వారా సామ్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.
పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలని అనుకున్న సమంత పిల్లలని కనాలనే ప్లాన్ చేసిందని ఆమె సన్నిహితులు అంటున్నారు. అయితే ఇప్పుడు డైవోర్స్ తర్వాత మళ్లీ సినిమాలపై దృష్టి పెడుతుందట. భారీ బడ్జెట్ తో గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన శాకుంతలం సినిమాని ఇప్పటికే పూర్తి చేసిన సామ్ ఓ తమిళ చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉంది. ఇది పూర్తయ్యాక సమంత.. తాను ఒప్పుకున్నమూడు ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలను వెల్లడించనుందని సమాచారం.
ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత సమంతకు బాలీవుడ్ ఆఫర్స్ కూడా వస్తున్న నేపథ్యంలో ఆమె తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్ట్‌కి సైన్ చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే అఫీషియల్ ప్రకటన చేయనుందని అంటున్నారు. సమంత నటించిన పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ ప్రస్తుతం డబ్బింగ్ జరుపుకుంటోంది. శకుంతలగా సమంత నటిస్తుండగా, దుష్యంతుడి పాత్రను ప్రముఖ మలయాళ నటుడు దేవ్ మోహన్ పోషిస్తున్నారు.
ఇక చిన్నారి భరతుడిగా అల్లు అర్జున్ కుమార్తే బేబీ అర్హ అలరించబోతోంది. సోమవారం నుండి డబ్బింగ్ ప్రారంభించినట్టు గుణ టీమ్ వర్క్స్ సంస్థ తెలిపింది. పాన్ ఇండియా మూవీగా పలు భారతీయ భాషల్లో ఒకేసారి వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ మాసాల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…