Maa : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఏమెగానీ.. మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న వర్గపోరు బయట పడింది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ, మంచు ఫ్యామిలీ మధ్య వైరం ఉందంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. తెలుగు సినిమా 75 వసంతాల వేడుకలో చిరంజీవిని అందరూ స్టేజిపై పొగడడం మోహన్ బాబుకు నచ్చలేదు. దీంతో ఆయన ఆ స్టేజిపైనే తన ఆవేశాన్ని వెళ్లగక్కారు.
అయితే అప్పటి నుంచి ఇండస్ట్రీ రెండు వర్గాలుగా విడిపోయిందని అడపా దడపా వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా మరోమారు మా ఎన్నికల నేపథ్యంలో మళ్లీ ఈ అంశం తెర మీదకు వచ్చింది. ఈ సారి ఈ వాదన బలంగానే వినిపించింది. దానికి తోడు ‘మా’ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని.. తాము ఇంకా అసోసియేషన్ ప్రతినిధులుగా ఉంటే.. రేపెప్పుడైనా ఏ కార్యక్రమాన్ని అయినా అడ్డుకుంటే తమపై బురద జల్లుతారేమోనని.. ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు 11 మంది మూకుమ్మడిగా రాజీనామా చేశారు. దీంతో మంచు విష్ణుకు చక్కని అవకాశం దక్కినట్లు అయింది.
అయితే ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మరీ అనేక సంచలన విషయాలను వెల్లడించారు. వాటిలో ఎక్కువగా మోహన్‌బాబు, నరేష్‌లపై చేసిన వ్యాఖ్యలే ఎక్కువగా ఉన్నాయి. ఈ సందర్భంగా బెనర్జీ మాట్లాడుతూ.. మీడియా ముందే కన్నీటి పర్యంతమయ్యారు. తనను మోహన్ బాబు బండ బూతులు తిట్టారని తెలిపారు.
ఇక మా అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్ ఎప్పుడో ఉన్నారని.. అయితే ఈ విషయం తెలిసిన మోహన్ బాబు కావాలనే మంచు విష్ణును బరిలోకి దించారని.. చిరంజీవి నచ్చ జెప్పినా మోహన్ బాబు వినలేదని.. బెనర్జీ ఆరోపించారు.
ప్రకాష్ రాజ్ అందరికన్నా ముందే తన ఇష్టతను ప్రదర్శించారని, కనుక ఈసారికి ఆయనను మా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుందామని, తరువాత విష్ణుకు చాన్స్ ఇద్దామని చిరంజీవి మోహన్‌బాబుకు చెప్పారట. అయినా మోహన్ బాబు పట్టుదలతో విష్ణును నిలబెట్టారట. అయితే ప్రకాష్ రాజ్ ను తీసేస్తాం, మోహన్ బాబును అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుందాం.. అని చిరంజీవి ఓపెన్ ఆఫర్ ఇచ్చారట. అయినప్పటికీ మోహన్ బాబు మాత్రం మంచు విష్ణునే పోటీలో నిలిపారని.. బెనర్జీ తెలిపారు. దీంతో చిరంజీవి హార్ట్ అయ్యారని అన్నారు.
అయితే ప్రకాష్ రాజ్ ప్యానెల్ ప్రెస్ మీట్ పెట్టడంతో ఇప్పుడు మంచు విష్ణు ప్రెస్ మీట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన ఏం చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…