Samantha : బ్యూటీ క్వీన్ సమంత ప్రస్తుత తరుణంలో ఎంతో బిజీగా మారింది. ఇటీవలే ఆమె పుష్ప సినిమాలో చేసిన ప్రత్యేక సాంగ్ హిట్ కావడంతో ఆమె మరింత పాపులర్ అయింది. దీంతో ఆమెతో ఐటమ్ సాంగ్స్ కోసం దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఇక ప్రస్తుతం సమంత పలు వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆ భాష ఈ భాష అని లేకుండా వచ్చిన ప్రతి సినిమా చాన్స్‌కు ఓకే చెబుతోంది. అలాగే వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తోంది. మరోవైపు వెకేషన్స్‌లోనూ ఎంజాయ్ చేస్తోంది.

అయితే సమంత తాజాగా ముంబైలో తళుక్కుమంది. అక్కడ ఓ భవనం నుంచి బయటకు వస్తుండగా ఆమెను కెమెరాలు క్లిక్‌మనిపించాయి. అయితే అంతా బాగానే ఉంది కానీ.. ఆమె ధరించిన టీ షర్టుపైనే ఎఫ్ పదంతో వచ్చే మాటలు ఉన్నాయి. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
Samantha : ఎఫ్.. మాటలు మూడు సార్లు..
ఎఫ్.. మాటలు మూడు సార్లు ఉన్న టీ షర్టును ధరించిన సమంత అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మరి తెలిసే ఈ టీ షర్టును వేసుకుందా.. అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఆ ఎఫ్.. మాటకు ఎలాంటి అర్థం వస్తుందో అందరికీ తెలుసు. అయినప్పటికీ ఆమె ఆ మాటలు ఉన్న టీషర్టును ధరించిందంటే.. ఆమె చాలా ధైర్యం చేసిందనే చెప్పాలి.
ఇక ఆమెకు చెందిన ఈ తాజా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై నెటిజన్లు ఇంకా స్పందించాల్సి ఉంది. ఇప్పటికే నాగచైతన్యకు విడాకులు ఇచ్చిందని చెప్పి సమంతను ఒక రేంజ్‌లో ఆడుకుంటున్నారు. ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఇలాంటి టీ షర్టు ధరించడాన్ని చూస్తే నెటిజన్లు ఎలా స్పందిస్తారోనని ఉత్కంఠగా ఉంది. దీనిపై నెటిజన్ల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.