Poonam Bajwa : సోషల్ మీడియాలో పూనమ్ బజ్వా ఈమధ్య కాలంలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటోంది. అందులో భాగంగానే ఎప్పటికప్పుడు పిచ్చెక్కించే రీతిలో తన గ్లామర్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అలరిస్తోంది. ఇక తాజాగా యోగా చేస్తూ ఈ బ్యూటీ అందాలను ఆరబోసింది. ఆ ఫొటోలను తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేయగా.. అవి వైరల్ అవుతున్నాయి.

పూనమ్ బజ్వా ఫిట్ నెస్ పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తుంది. ఎంతో ఫిట్‌గా ఉంటూ గ్లామర్ షో చేస్తున్నా.. ఈ అమ్మడికి అవకాశాలు మాత్రం పెద్దగా రావడం లేదు. ఇప్పటికే ఎన్నోసార్లు అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలను ఈమె షేర్ చేసింది. అయినా పెద్దగా ఫలితం లేదు. ఇప్పటికే కెరీర్ చివర్లో ఉన్నట్లుగా పూనమ్ బజ్వా పరిస్థితి మారింది.
Poonam Bajwa : సరైన పాత్ర లభించలేదు..
ప్రస్తుత తరుణంలో చాలా మంది యంగ్ హీరోయిన్లు ఎప్పటికప్పుడు అవకాశాలను అంది పుచ్చుకుంటూ కెరీర్‌లో వేగంగా దూసుకెళ్తున్నారు. కానీ పూనమ్ బజ్వా మాత్రం కెరీర్ తొలినాళ్లలో పెద్దగా అవకాశాలను దక్కించుకోలేకపోయింది. వచ్చిన రెండు, మూడు అవకాశాల్లోనూ ఈమెకు సరైన పాత్ర లభించలేదు. పైగా ఆ మూవీలు హిట్ కూడా కాలేదు.
సినిమాలు హిట్ అయితేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాంటిది హిట్స్ లేకుండా సినిమా అవకాశాలను ఆశించడం అంటే.. అది సాహసమనే చెప్పాలి. మరి ఈ అమ్మడికి రానున్న రోజుల్లో అయినా అదృష్టం కలసి వస్తుందా.. అనేది చూడాలి.