Samantha : నయనతార, విజయ్ సేతుపతి, సమంత.. ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం.. కాతు వాకుల రెండు కాదల్. దీన్ని తెలుగులో కణ్మణి రాంబో కతీజా పేరిట విడుదల చేయనున్నారు. ఈ నెల 28వ తేదీన ఈ మూవీ తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది. చాలా రోజుల తరువాత సమంత వెండితెరపై మరోమారు ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను అలరించనుంది. విడాకుల తరువాత రిలీజ్ అవుతున్న ఆమె నటించిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం. అయితే ఇందులో సమంత పాత్రను తీర్చిదిద్దిన తీరును ఆమె ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు.

కాతు వాకుల రెండు కాదల్ సినిమాను నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ తెరకెక్కించారు. అయితే ఇందులో నయనతార గ్లామర్ షో చేయలేదు. టీజర్, పోస్టర్‌లను చూస్తే ఆ విషయం స్పష్టమవుతోంది. అయితే సమంత మాత్రం గ్లామర్ షో చేసినట్లు అర్థమవుతోంది. దీంతో సమంత ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నీ ప్రియురాలు ఒకలా.. సమంత మరొకలా ఎందుకు.. నీ లవర్ అని చెప్పి నయనతారతో చీర కట్టించావా.. సమంత కాదు కదా.. కనుకనే ఆమెతో గ్లామర్ షో చేయిస్తున్నావా.. అంటూ సమంత ఫ్యాన్స్.. విగ్నేష్ శివన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే వాస్తవానికి నయనతార గ్లామర్ షో చేయడం మానేసి చాలా రోజులే అవుతోంది. ఆమె నటిగా మంచి గుర్తింపు పొంది.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నప్పటి నుంచి గ్టామర్ షో చేయడం లేదు. దీంతో ఆమె ప్రతి మూవీలోనూ సాధారణంగానే కనిపిస్తోంది. ఇక సమంత అలా కాదు. పెళ్లయినా కూడా గ్లామర్ షో చేస్తూనే వస్తోంది. ఇక విడాకులు ఇచ్చినప్పటి నుంచి ఆ డోసు కాస్త పెంచిందే తప్ప తగ్గించలేదు. అందువల్ల గ్లామర్ షో చేయడం అనేది ఆమె ఇష్టమని.. అందులో దర్శకుడి ప్రమేయం ఉండదని.. గ్లామర్ షో ఉంటుందా.. ఉండదా.. అనేది సినిమా చేసే ముందే చెబుతారు కనుక.. సమంత మనస్ఫూర్తిగానే ఈ మూవీకి ఒప్పుకుందని తెలుస్తోంది. అందులో దర్శకున్ని తప్పు పట్టాల్సిన పనిలేదని కొందరు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఒకరు బలవంతంగా గ్లామర్ షో చేయించలేరని అంటున్నారు. ఇక సినిమాలో సమంత ఎలా కనిపిస్తుందో చూడాలి.