Samantha : నాగచైతన్యతో ఉన్నన్ని రోజులు సమంతకు బాగానే గడిచింది. అక్కినేని వారి ఇంటి కోడలు కనుక, ఆమె ఎలాగూ సక్సెస్‌ఫుల్ హీరోయిన్ కనుక.. పెద్ద పెద్ద ప్రాజెక్టులలో ఆఫర్స్ బాగానే వచ్చాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. ఆమె నాగచైతన్యతో విడాకులు తీసుకుంది. అక్కినేని అనే స్టేటస్‌ను కోల్పోయింది. దీంతో ఆమెకు ఆఫర్లను ఇవ్వాలంటే పెద్ద ప్రాజెక్టులకు చెందిన దర్శక నిర్మాతలు ఒకింత ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆమెకు గనక ఆఫర్ ఇస్తే రేప్పొద్దున అక్కినేని కుటుంబం నుంచి ఏవైనా ఇబ్బందులు వస్తాయేమోనని వారు అనుకుంటున్నట్లు టాక్. అయితే ఈవిషయం సమంతకూ తెలుసు. నాగచైతన్య నుంచి విడిపోయే ముందే ఇలాంటి విషయాలను బాగా ఆలోచించినట్లుంది. అందుకనే విడాకుల ప్రకటన అనంతరం చిన్నా పెద్దా తేడా లేకుండా వరుస సినిమా ఆఫర్లకు ఓకే చెబుతోంది. అందుకనే వెబ్ సిరీస్‌లలోనూ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.
అయితే మరోవైపు లవ్ స్టోరీ మూవీ సక్సెస్ జోష్‌లో ఉన్న నాగచైతన్య త్వరలో 3 భారీ మూవీలను చేయబోతున్నాడట. దీంతో తానేం తక్కువ తిన్నానా.. అని సమంత కూడా భారీ ప్రాజెక్టులు చేయాలని చూస్తున్నదట. అందులో భాగంగానే ఆమె పలువురు బడా హీరోలు, దర్శక నిర్మాతలకు ఫోన్లు చేసి మరీ ఆఫర్లు కావాలని రిక్వెస్ట్ చేస్తోందట.
అయితే సమంతకు పరిస్థితులు ఇంతకు ముందులా ఉండవనేది వాస్తవం. గతంలో ఆమె అక్కినేని కోడలు కనుక ఎవరైనా ఎలాంటి చిత్రంలో అయినా ఆఫర్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆమెకు ఆ స్టేటస్ పోయింది. సినీ ఇండస్ట్రీలో డబ్బు ఎంత ముఖ్యమో పేరు, ప్రఖ్యాతులు కూడా అంతే ముఖ్యం. కనుక ఆమెకు గతంలో మాదిరిగా ఆఫర్లు రాకపోవచ్చని అంటున్నారు.
అయినప్పటికీ సమంత మాత్రం చిన్న సినిమాలు చేస్తూనే పెద్ద ప్రాజెక్టుల్లో నటించాలని చూస్తోందట. దీంతో తనను తాను నిరూపించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆమెకు బడా ప్రాజెక్టుల్లో ఆఫర్లు వస్తాయా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…