Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ 5 తెలుగు ఎంతో రసవత్తరంగా కొనసాగుతోంది. వారాలు గడుస్తున్న కొద్దీ ఎవరు ఎలిమినేట్ అవుతారా ? అన్న ఉత్కంఠ రోజు రోజుకీ పెరిగిపోతోంది. వారాంతాల్లో ఎలిమినేషన్ ప్రక్రియ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే కొన్ని రోజులుగా ప్రియాంక సింగ్ గేమ్ శైలి మార్చిందని చెప్పవచ్చు.
ప్రియాంక సింగ్ బిగ్ బాస్ ఇంట్లో కొంచెం యాక్టివ్‌గా ఉన్నట్లు అనిపిస్తోంది. ముఖ్యంగా మానస్ చుట్టూ ఆమె తిరుగుతుండడం.. షణ్ముఖ్‌తో గొడవలు చూస్తుంటే.. ప్రేక్షకుల సపోర్ట్ కోసమే ఇదంతా చేస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. అయితే ఎంత చేసినా బయటి నుంచి వచ్చే ఓట్లు చాలా ముఖ్యం. కనుక ఆ దిశగా కూడా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది.
బయటి వారు వేసే ఓట్లు బిగ్ బాస్ ఇంటి సభ్యులకు చాలా కీలకం. కొన్ని వారాలు కొన్ని సభ్యులను ఓట్లతో పనిలేకుండా ఎలిమినేట్ చేశారు. కానీ విశ్వ ఎలిమినేషన్‌లో ఓట్లే కీలకంగా పనిచేశాయి. అతను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినప్పటికీ తక్కువ ఓట్లు వచ్చిన కారణంగా ఎలిమినేట్ అయ్యాడు. అందువల్ల ఓట్లను అంత తక్కువ చేసి చూడరాదని స్పష్టమైంది. అయితే సీజన్ మరీ కీలక దశకు చేరుకుంటున్న సమయంలో ప్రియాంక సింగ్‌కు హిజ్రాలు షాకిచ్చారు.
ప్రియాంక సింగ్ తమకు ఎవరో తెలియదని, ఆమె తమ కమ్యూనిటీకి చెందినవారు కాదని, కనుక ఆమెకు సపోర్ట్ చేసేది లేదని.. తెలంగాణ రాష్ట్ర సమితి హిజ్రా ఫౌండర్ చంద్రముఖి షాకింగ్ కామెంట్స్ చేశారు. సాధారణంగా పుట్టినప్పటి నుంచి ఆడ లక్షణాలు ఉండి ఆ తరువాత అమ్మాయిల్లా బట్టలు వేసుకుని హిజ్రాగా మారితేనే ట్రాన్స్‌జెండర్ అంటారని, అలాంటిది ప్రియాంక ఆడపిల్లలా మారాలనే కోరికతో ఆ విధంగా మారిందని, కనుక ఆమె తమ కమ్యూనిటీ కాదని తెలిపారు.
గతంలో బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న తమన్నా సింహాద్రి తమ కమ్యూనిటీయే కాబట్టి ఆమెకు సపోర్ట్ చేశామని, కానీ ప్రియాంకకు సపోర్ట్ చేయబోమని స్పష్టం చేశారు. దీంతో ప్రియాంక సింగ్‌కు ఈ విషయం మైనస్ అవుతుందని చెప్పవచ్చు. మరి ప్రియాంక బయటి వారి ఓట్లు రాబట్టడంలో ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…