Samantha : కొన్ని కారణాల వలన అక్కినేని ఫ్యామిలీతో తెగదెంపులు చేసుకుంటూ నాగ చైతన్యకు విడాకులు ఇచ్చేసింది స్టార్ హీరోయిన్ సమంత. అప్పటి నుంచి తన పూర్తి ఫోకస్ ను సినీ కెరీర్ మీద పెట్టేసింది. అక్కినేని ఫ్యామిలీ నుంచి విడిపోయిన తర్వాత గ్లామర్ డోస్ ను పెంచుతూ వరుస ప్రాజెక్ట్స్ ను ఓకే చేస్తూ దూసుకుపోతోంది. దాదాపు యువ హీరోలందరితోనూ నటించింది సమంత. చేతి నిండా సంపాదన ఉన్న హీరోయిన్లలో ముందు వరుసలో ఉండేవారు ఎవరు అంటే మొదటిగా సమంత పేరు వినిపిస్తుంది.
ఏజ్ పెరుగుతున్నా క్రేజ్ తగ్గని హీరోయిన్ సమంత. ప్రస్తుతం సమంత క్రేజ్ పెరగడంతో తను నటించే ఒక చిత్రానికి దాదాపు రూ.30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటుందట. అంతే కాకుండా యాడ్స్ తో మరియు తన సోషల్ మీడియా అకౌంట్ లో ప్రమోషన్స్ ద్వారా కోట్ల రూపాయల ఆదాయాన్ని కూడా కూడబెట్టుకుంది. మరి అంతా సంపాదనను సమంత ఏం చేస్తుందో తెలుసా. ఆ విషయాన్ని తెలుసుకుంటే కచ్చితంగా ఆశ్చర్యపోతారు.

ప్రస్తుతం సమంత డబ్బును ఖర్చు చేయడానికి సంబంధించి షాకింగ్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత తాను సంపాదించిన సంపాదనలో అధిక శాతం విరాళాల రూపంలో ఖర్చు చేస్తుందని తెలుస్తోంది. సమంత చేసే సేవా కార్యక్రమాల గురించి చాలా కొద్ది మందికే తెలుసు. సమంత ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా తన వంతుగా సేవను సమాజానికి అందిస్తుంది.
చిన్న పిల్లలను, వృద్ధులను ఆదుకోవడంలో ఎప్పుడూ ముందు ఉంటుంది సమంత. సమంత తన సంపాదనలో అధిక శాతం కొన్ని పౌండేషన్స్ కి విరాళంగా ఇచ్చి తన ఉదార స్వభావాన్ని చాటుకుంటుంది. సమంత గురించి ఈ విషయం తెలుసుకున్న వారు సమంత చేసే పనికి ఇంప్రెస్ అయిపోతున్నారు. ప్రస్తుతం సమంత వరుసగా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. సమంత నటించిన శాకుంతలం, యశోద చిత్రాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. తెలుగుతోపాటు హిందీ, తమిళ చిత్రాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా దూసుకుపోతోంది సామ్.
కొన్ని కారణాల వల్ల సామ్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది. మళ్లీ తమ క్రేజీ హీరోయిన్ ఇంతకూ ఎప్పుడు సోషల్ మీడియా ద్వారా ముందుకు వస్తుందా అంటూ అభిమానులు వెయిట్ చేస్తున్నారు.