Bandla Ganesh : సినీ నటుడు, బడా నిర్మాత బండ్ల గణేశ్ ఏం చేసినా ఒక సెన్సేషనలే. ప్రతినిత్యం ప్రముఖులను విమర్శిస్తూ ఏదో విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తన మనసులోని మాటను ఏ మాత్రం సంకోచం లేకుండా కుండ బద్దలు కొట్టినట్టు బయటకు చెప్పేస్తుంటారు. ట్విట్టర్ వేదికగా సినీ స్టార్స్ ని విమర్శిస్తూ విరుచుకుపడుతుంటారు. తాజాగా జరిగిన చిత్ర ప్రి-రిలీజ్ ఫంక్షన్ లో దర్శకుడు పూరీ జగన్నాథ్ ను టార్గెట్ చేస్తూ విమర్శించిన విషయం అందరికీ తెలిసిందే.
ఇప్పుడు బండ్ల గణేష్ ఇద్దరు హీరోలను టార్గెట్ చేస్తూ ట్విట్టర్ ద్వారా చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొదటినుంచి నేను పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్ ని. కాదు కాదు పవన్ కళ్యాణ్ భక్తుడిని అంటూ ఆయన చెప్పుకుంటూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ ఇద్దరూ హీరోలను విమర్శించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

బండ్ల గణేష్ యువ హీరోలను ఉద్దేశించి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. తాజాగా జరిగిన ఓ ఈవెంట్ లో చాలామంది ప్రముఖుల ముందు అడివి శేష్, సిద్దు జొన్నలగడ్డ కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చున్నారు. అయితే ఈ విషయం గమనించిన బండ్ల గణేష్ ఆ ఫోటోతోపాటు, వేరే ఫంక్షన్ లో వినియంగా కూర్చున్న పవన్ కళ్యాణ్ ఫోటోను షేర్ చేస్తూ ట్వీట్ చేశాడు. ఆయన ట్వీట్ లో సంస్కారానికి నిలువెత్తు నిదర్శనం మా దేవర.. దయచేసి నేర్చుకోండి.. ఆచరించండి. ఇది మన ధర్మం అంటూ పవన్ కళ్యాణ్ ను మధ్యలోకి తీసుకొచ్చాడు.
దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తోపాటు మిగతా స్టార్ హీరో ఫ్యాన్స్ కూడా ఆయనకు సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు. ఆ మాత్రం మినిమమ్ సెన్స్ ఉండాలిగా అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు బండ్లన్న నీకు ఇది అవసరమా.. ప్రతి విషయంలో అన్నయ్యను ఎందుకు లాగుతావు. వేరే విషయం ఏమన్నా ఉంటే చూడు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.