Samantha : ఏ మాయ చేశావె చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై అందర్నీ తన మాయలో పడేసింది సమంత. మొదటి చిత్రంతోనే సక్సెస్ ను అందుకుని వరుస ఆఫర్లతో టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు దశాబ్దంపైన గడుస్తున్నా సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. సక్సెస్‌ఫుల్ హీరోయిన్ గా ఉన్న టైమ్‌లోనే నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకుంది. అసలు కారణాలు ఏమిటో తెలియదు కానీ, కొన్ని మనస్పర్థల వలన ఈ మోస్ట్ రొమాంటిక్ కపుల్ గత ఏడాది విడాకులతో వివాహ బంధానికి స్వస్తి చెప్పారు.
నాగచైతన్య తో విడిపోయిన తరువాత సమంత గ్లామర్ డోస్ బాగా పెంచేసింది. అందాల ఆరబోత ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ కుర్రకారు మతులు పోగొడుతోంది. సమంతకు ఇన్‌స్టాగ్రామ్ లో దాదాపుగా 25 మిలియన్స్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారంటే, ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో వేరే చెప్పనవసరం లేదు. ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ పోస్ట్ ద్వారా ఆమె లక్షల రూపాయలు సంపాదిస్తోంది.

ఎప్పుడూ ఇన్‌స్టాగ్రామ్ లో ఫుల్ జోష్ తో సమంత కనీసం రోజుకు ఏదో ఒక పోస్ట్ చేస్తూ ఉండేది. తన లేటెస్ట్ ఫొటోషూట్ లకు చెందిన ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులకు ఎంతో దగ్గరగా ఉండేది. ఏమైందో కానీ ఇప్పుడు సమంత ఇన్‌స్టాగ్రామ్ లో తన యాక్టివిటీని తగ్గించింది. గత ఎనిమిది వారాలుగా సమంత ఎక్కువగా బ్రాండ్ ఎండార్స్‌మెంట్ వంటి పెయిడ్ పోస్ట్ లను మాత్రమే షేర్ చేస్తోంది. అప్పుడప్పుడూ ట్విట్టర్ ని వినియోగిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ వినియోగించడం తగ్గించినట్లు కనిపిస్తోంది. బహుశా సమంత తన వ్యక్తిగత జీవితంలో, కెరియర్ లో ముఖ్యమైన పనిలో ఉన్నట్లు అనిపిస్తోంది. అందుకే ఇన్‌స్టాగ్రామ్ కి కొంతకాలంగా దూరంగా ఉంటుందని తెలుస్తోంది.