Chiranjeevi : టాలీవుడ్ మెగాస్టార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చారు. స్వయం కృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ మెగాస్టార్‌గా ఎదిగారు. చిరంజీవి ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించారు. అలాగే కోట్ల ఆస్తులు కూడబెట్టారు. ప్రస్తుతం చిరంజీవి ఒక్కో సినిమాకు రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం. ఇక చిరంజీవికి ఎన్నో చోట్ల ఆస్తులున్నాయి. చెన్నైలో ఎన్నో విలువైన భూములు, ఆస్తులను ప్రజారాజ్యం టైంలో అమ్మేశారని అంటుంటారు. అయినా చిరంజీవికి హైదరాబాద్‌లో చాలాచోట్ల ఖరీదైన భూములున్నాయి.
చిరు తన సంపాదనలో చాలా భాగం భూమి మీదే పెట్టారని అంటుంటారు. అయితే తాజాగా చిరు తన విలువైన ఓ ఆస్తిని అమ్మేసినట్లు ఓ వార్త వైరల్ అవుతోంది. హైదరాబాద్ ఫిలిం నగర్‌లో మెయిన్ రోడ్‌లో 3000 గజాల స్థలం ఉంది. అప్పట్లో దీన్ని ఆయన రూ.30 లక్షలకు కొనుగోలు చేశారని టాక్ ఉంది. ఇప్పుడు ఆ అత్యంత విలువైన స్థలాన్ని అమ్మేశారని తెలుస్తోంది. అంత విలువైన స్థలాన్ని చిరంజీవి అమ్మాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ స్థలం అమ్మడానికి కారణం ఓ ప్రముఖ దినపత్రిక యజమాని ఎప్పటి నుంచో ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది.

గత కొన్నేళ్లుగా ఆ దినపత్రికకు చెందినవారు ఈ మేరకు చిరును అడుగుతున్నారని సమాచారం. ఇక్కడ ఆయన ఆ దినపత్రిక ఛానల్ కార్యాలయం నిర్మిస్తారని అంటున్నారు. అయితే చిరు స్థలానికి అమ్మకం, కొనుగోలు రెండు పూర్తయినట్లు తెలుస్తుండగా సుమారు రూ.70 కోట్లకు కాస్త అటు ఇటుగా ఈ డీల్ కుదరిందని సమాచారం. ఫిలింనగర్‌లో గజం రెండు లక్షలకు పైగానే పలుకుతోంది. ఈ డీల్ రెండున్నర లక్షలకు కాస్త తక్కువగా జరిగిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి చిరు అంత తక్కువకు ఆ స్థలాన్ని అలా ఎందుకు అమ్మారనే చర్చ నడుస్తోంది. అయితే ఆచార్య కారణంగా వచ్చిన నష్టాలను భర్తీ చేసేందుకే ఆయన ఆ స్థలం అమ్మారని అంటున్నారు. ఇక ఇందులో నిజం ఎంత ఉంది.. అనే విషయం తెలియాల్సి ఉంది.
ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం ఆచార్య తర్వాత మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళాశంకర్ సినిమాల్లో నటిస్తున్నారు. గాడ్ ఫాదర్ సినిమాను దసరాకు రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.