Bigg Boss : ఏ మాయ చేసావే సినిమాలో జంటగా నటించి నిజ జీవితంలో కూడా ఒక్కటైన జంట సమంత, నాగచైతన్య. వీరిని అభిమానులు ముద్దుగా చైసామ్ అని పిలుచుకుంటారు. ఈ టాలీవుడ్ స్టార్ కపుల్ గతేడాది విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. వీరి విడాకుల వార్తను సామ్ అభిమానులతోపాటు చైతూ అభిమానులు కూడా జీర్ణచుకోలేకపోయారు. కొన్నాళ్ళ పరిచయం, ఎన్నో ఏళ్ల ప్రేమ.. అనంతరం పెళ్లి చేసుకున్న ఈ జంట ఐదేళ్లకే వీరి వైవాహిక జీవితానికి శుభం కార్డు వేశారు. విడాకుల అనంతరం కూడా వీళ్ళు మళ్లీ ఒకటవుతారనే అభిమానులు భావిస్తూ వచ్చారు కానీ కొన్నాళ్ళకు అలా జరిగే అవకాశం లేదని అర్థం అయింది.
వీరిద్దరూ విడిపోవడానికి కారణం ఏంటో ఇప్పటికీ తెలియదు కానీ ఎక్కడ చూసినా వీరి టాపిక్ నడుస్తుంది. వీరిద్దరి విడాకులకు కారణం ఇదే అంటూ రోజుకొక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. ఇప్పుడు వీరిద్దరి టాపిక్ బిగ్ బాస్ హౌస్ లోకి కూడా వచ్చింది. నాగ చైతన్య, సమంత విడాకుల టాపిక్ గురించి బిగ్ బాస్ హౌస్ లో మాట్లాడుకున్నారు. హౌస్‌లోని ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు మాట్లాడుకునేటప్పుడు ఈ టాపిక్ చర్చకు వచ్చిందట. ఈ నలుగురిలో టాప్ కంటెస్టెంట్ గా ఉన్న ఓ అమ్మాయి మాట్లాడుతూ.. సమంతదే కరెక్ట్ అనగా.. మరొక మేల్ కంటెస్టెంట్ ఈ విషయంలో నాగ చైతన్యని సపోర్ట్ చేశాడట.
మిగిలిన ఇద్దరూ మాత్రం ఇది మనకు అనవసరమైన టాపిక్.. ఇలాంటి విషయాలు బిగ్ బాస్ హౌస్ లో మాట్లాడకూడదు అని వారికి గుర్తు చేశారట. దీంతో వాళ్ళిద్దరూ ఇంతసేపు తప్పుగా మాట్లాడాము అని భావించి సైలెంట్ అయ్యారట. అయితే వెంటనే మా టీవీ యజమాన్యం మాత్రం వీరు మాట్లాడుకున్న వీడియోని డిలీట్ చేశారు అని ఒక రూమర్ చక్కర్లు కొడుతోంది. అయితే ఇది పుకారు మాత్రమేనా లేక ఇందులో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…