Anchor Suma : సుమ కనకాల.. బుల్లితెరపై ఏ షో అయినా, ఈవెంట్ అయినా మొదటగా వినిపించేది ఈ పేరే. సుమ కాదంటేనే ఆ ప్రోగ్రాం లేదా ఈవెంట్ వేరే యాంకర్ కి వెళ్తుంది. అంతలా తన యాంకరింగ్ తో స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది సుమ. ఆమె యాంకరింగ్ అంటే ఒక గల గల ప్రవాహం లాంటిది. సుమ చేసే ప్రతి షో కూడా వీక్షకులు చూడటానికి ఎంతో ఇష్టపడతారు.
యాంకరింగ్ లో ఆమె మాట తీరు, నడవడిక, పెద్దవారి పట్ల ఆమె చూపించే గౌరవం అందరూ ఎంతో ఇష్టపడుతుంటారు. ఆమె యాంకరింగ్ కి ఇండస్ట్రీలో కూడా సుమకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ప్రతి ఒక్కరు ఆమె మాట తీరుపై పాజిటివ్ గానే స్పందిస్తారు. యాంకర్ గా సుమ కెరియర్ ప్రారంభించిన మొదటి నుంచి ఇటిప్పటివరకైతే ఆమె యాంకరింగ్ స్టైల్ కూడా అలానే ఉంటుంది. ఇప్పటి యాంకర్ లాగా ఎవరినీ హర్ట్ చేయడం డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడడం వంటి పనులు సుమ చేసేది కాదు. కానీ ఈ మధ్యకాలంలో సుమ కూడా యాంకరింగ్ విషయంలో హద్దులు దాటేస్తున్నట్టు అభిమానులు చెప్పుకొస్తున్నారు.
ఇటీవల సుమ కనకాల నాగశౌర్య హీరోగా నటించిన కృష్ణ వింద విహారి చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్ కు యాంకరింగ్ చేసింది. ఎంతో ఘనంగా జరిగిన ఈ ఈవెంట్ లో సుమ కనకాల తనదైన స్టైల్ లో హోస్ట్ చేస్తూ ఫుల్ కామెడీతో అందరినీ ఆకట్టుకున్నారు. అయితే ఈ క్రమంలోనే యాక్టర్ బ్రహ్మాజీకి, సుమకి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కామెడీ పండించే తీరులో బ్రహ్మాజీ, సుమ ఇద్దరిలో ఎవరినీ తీయాల్సిన అవసరం లేదు. ఎవరికి వారే కామెడీ విషయంలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తారు. ఇక ఇద్దరు కూడా ఒకే స్క్రీన్ పై కనిపిస్తే అమ్మో ఇక అసలు చెప్పలేం వారు చేసే ఫుల్ కామెడీతో అందరూ కడుపుబ్బా నవ్వి నవ్వి పొట్ట చెక్కలు అవ్వాల్సిందే. ఈ ఈవెంట్ లో బ్రహ్మాజీ, సుమ మధ్య సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
యాంకరింగ్ చేస్తూ మధ్యలో సుమ స్టేజ్ దిగి బ్రహ్మాజీ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. దీంతో హాయిగా రిలాక్స్ గా అనిపిస్తుంది ఇప్పుడు మాట్లాడుకుందామా అంటూ బ్రహ్మాజీతో సరదాగా మాటలు కలిపే ప్రయత్నం చేస్తుంది సుమ. ఈ క్రమంలోనే సుమ ఆయనని అడిగిన ప్రశ్నలు ఎక్కడికో దారితీశాయి. ఆమె మాట్లాడుతూ మీ ఏజ్ ఎంత..? అంటూ యాంకర్ సుమ బ్రహ్మాజీని ప్రశ్నిస్తుంది.
దీంతో బ్రహ్మాజీ కూడా నవ్వుతూ..యు నాటీ.. ఆంటీ.. అంటూ అందరికీ షాక్ ఇచ్చాడు. బ్రహ్మాజీ దెబ్బకు సుమ ముఖం వాడిపోయింది. అంతేకాదు ఈ విషయం ఎక్కడికో వెళ్ళిపోతుంది.. నాకెందుకీ ఖర్మ అంటూ సంభాషణను కట్ చేస్తుంది. దీంతో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బ్రహ్మాజీ కామెంట్ చేసింది అనసూయని అంటూ కొందరు, మళ్లీ గత విషయాలని తవ్వుకుంటున్నారు అంటూ కొందరు చెప్పుకోవడం మొదలుపెట్టారు. అంతేకాదు సుమ చిచ్చు పెట్టేసి మెల్లగా ఏమీ తెలియనట్లు తప్పించుకుంది అంటూ ఓ రేంజ్ లో సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. అయితే దీనిపై అనసూయ ఏమైనా కౌంటర్ ఇస్తుందేమో చూడాలి.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…