Guava Leaves : మనకు సీజనల్‌గా లభించే అనేక రకాల పండ్లలో జామ పండ్లు కూడా ఒకటి. కొందరు వీటిని పచ్చిగా ఉండగానే తింటారు. అయితే ఇవి సాధారణంగా మనకు చాలా తక్కువ ధరకే లభిస్తాయి. అందుకనే దీన్ని పేదవాడి ఆపిల్ అని పిలుస్తారు. ఇక జామకాయల వల్ల మనకు అనేక రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. అయితే వాటితోపాటు జామ ఆకులు కూడా మనకు అనేక లాభాలను అందిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
జామ పండ్లే కాదు, జామ ఆకులు కూడా డయాబెటిస్‌ను అదుపు చేస్తాయి. జామ ఆకులతో తయారు చేసిన టీని 19 మందికి నిత్యం ఇచ్చి సైంటిస్టులు పరిశోధనలు చేశారు. దీంతో ఆ టీ తాగిన వారిలో షుగర్ లెవల్స్ తగ్గాయని గుర్తించారు. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు జామ ఆకులతో టీ తయారు చేసుకుని తాగితే మంచిది. జామ ఆకులను తిన్నా, ఆ ఆకులతో తయారు చేసిన టీని తాగుతున్నా శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. సైంటిస్టులు ఈ విషయాన్ని శాస్త్రీయంగా నిరూపించారు కూడా. దీని వల్ల గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
మహిళలు రుతు సమయంలో జామ ఆకులను తీసుకోవడం వల్ల వారికి తీవ్రమైన నొప్పి సమస్య తగ్గుతుందని సైంటిస్టులు తేల్చారు. ఇందుకు గాను వారు 197 మందికి జామ ఆకుల నుంచి తీసిన పదార్థాలను నిత్యం 6 మిల్లీగ్రాముల మోతాదులో ఇచ్చారు. దీంతో రుతు సమయంలో వారికి చాలా వరకు నొప్పి సమస్య తగ్గిందని గుర్తించారు. జామ ఆకుల్లో ఉండే పోషకాలు జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. జామ ఆకుల్లో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు జీర్ణాశయంలో సూక్ష్మ క్రిములను నాశనం చేస్తాయి. అలాగే డయేరియా సమస్య నుంచి బయట పడవచ్చు. విరేచనాలు అవుతున్న వారు జామ ఆకులను తింటే ప్రయోజనం ఉంటుంది.
జామ ఆకుల్లో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఆ ఆకులను తింటే క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. అలాగే వాటిలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. దీంతో వ్యాధులు రాకుండా ఉంటాయి. క్యాన్సర్ కణాలు పెరగకుండా ఉంటాయి. జామ పండ్లే కాదు, జామ ఆకుల్లోనూ విటమిన్ సి ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి బయట పడేస్తుంది. జామ ఆకులను సేకరించి పేస్ట్ రూపంలో వాటిని తయారు చేసుకుని ఆ మిశ్రమాన్ని చర్మంపై రాస్తే చర్మ సమస్యలు పోతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది. మొటిమలు తగ్గుతాయి. చర్మం సురక్షితంగా ఉంటుంది. ఇలా జామ ఆకులతో అనేక లాభాలను పొందవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…