Jr NTR : చిరంజీవి అంటే ఎవ‌రో తెలియ‌ద‌ని.. ఎన్‌టీఆర్ ఎందుకు అన్నారు..?

Jr NTR : మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు తన పని తాను చేసుకుంటూ వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి. ఆయనపై ఎలాంటి రూమర్స్ వచ్చిన కూడా వాటిని పట్టించుకోకుండా ఆయన ఎంతో సాధారణంగా ఉంటారు. ఒక స్టార్ హీరోకి మరో స్టార్ హీరోకి వ్యక్తిగతంగా కన్నా సినిమా పరంగా ఎన్నో సార్లు ఢీకొట్టే సందర్భాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మెగాస్టార్ మరియు నందమూరి ఫ్యామిలీ వారు సినిమాలతో థియేటర్ల దగ్గర పోటీ పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఎవరు ఏ మాత్రం తగ్గకుండా నటన పరంగా వాళ్ల చిత్రలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేవారు.

అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన తొలినాళ్లలో మెగా ఫ్యామిలీ అంటే ఆయనకు ఇష్టం లేదు అనే వార్తలు బాగా ప్రచారం అయ్యేవి. అంతేకాకుండా ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో లైవ్ లో మాట్లాడుతూ చిరంజీవి ప్రస్తావన రావడంతో ఆయన ఎవరో నాకు తెలియదు అనడం అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కొంతకాలంపాటు నందమూరి నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్ కి, మెగాస్టార్ ఫ్యామిలీతో విభేదాలు ఉన్నాయనే వార్తలు విస్తృతంగా వినిపించేవి.

Jr NTR

అసలు ఈ వార్తలకు గల కారణం ఏమిటి..? ఈ కుటుంబాల మధ్య ఉన్న విభేదానికి కారణం ఎవరు..? వార్తల్లో ఉన్నది ఎంత వరకు నిజం అనే విషయంలోకి వెళ్తే.. ప‌రిస్థితులు మారి చిరంజీవి మ‌న‌స్త‌త్వం గురించి ఎన్టీఆర్ తెలుసుకోవ‌డంతో ఇప్పుడు ఎన్టీఆర్ మెగా ఫ్యామిలీకి చాలా ద‌గ్గ‌ర‌య్యాడు. ఎన్టీఆర్‌, మెగాస్టార్ తన‌యుడు రామ్‌చ‌ర‌ణ్‌తో ఉన్న స్నేహ బంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇద్ద‌రూ ఆర్ఆర్ఆర్ మూవీలో కలిసి న‌టించారు. ఆర్ఆర్ఆర్ మూవీ గురించి ఇద్దరూ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా.. క‌రోనా, ఒమిక్రాన్ కార‌ణం వలన సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఈ చిత్రం షూటింగ్ టైంలో వీళ్లిద్దరి మధ్య అనుబంధం మరింత పెరిగింది.

కెరీర్ ప్రారంభంలో చిరంజీవి అంటే ఎన్టీఆర్‌కు ఎందుకు ప‌డ‌లేదనే ప్ర‌శ్న‌కు ఎవ‌రూ కూడా స‌రైన స‌మాధానం చెప్పేవారు కాదు. బాక్సాఫీస్ వసూళ్లు, ఇమేజ్ వ‌ల్ల వ‌చ్చిన ఈగో క్లాషెష్ అని మాత్రం ప‌లువురు ప్రముఖులు  అభిప్రాయాన్ని వ్యక్తం చేసేవారు. అప్ప‌ట్లో ఒక నెంబ‌ర్ వ‌న్ హీరో గురించి, ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తార‌క్ త‌న‌కు తెలియ‌దు అని పేర్కొన‌డం మెగాఫ్యాన్స్‌కు కొంచెం బాధ కలిగించింది.

మెగా-నంద‌మూరి ఫ్యామిలీ పాత గొడ‌వ‌లకు కార‌ణం ఏమిటి..? అనే దానిపై సీనియ‌ర్ నిర్మాత‌, డిస్ట్రిబ్యూట‌ర్ అయిన ఆవుల గిరి ఓ ఇంటర్వ్యూ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ కెరీర్ స్టార్టింగ్‌లో ఆయన దగ్గర ఓ మేనేజ‌ర్ ఉండేవాడ‌ట‌. ఆ మేనేజ‌ర్ చిరంజీవి గురించి చెడుగా ఎన్టీఆర్ కు లేనిపోనివి చెప్పేవాడ‌ట‌. మేనేజ‌ర్ గురించి అస‌లు నిజం తెలియ‌డంతో ఎన్టీఆర్ అతని ఉద్యోగం నుంచి తొలగించారని, ఆ త‌రువాత చిరు ఫ్యామిలీ మెంబ‌ర్స్‌తో ఎన్టీఆర్‌కు స్నేహబంధం పెరిగిన‌ట్టు నిర్మాత‌ గిరి ఆ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM