Salman Khan : పాము కాటుకి గురైన స‌ల్మాన్ ఖాన్.. ఆందోళ చెందుతున్న అభిమానులు..

Salman Khan : బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ పాము కాటుకు గురైన‌ట్టు తెలుస్తోంది. పన్వేల్‌లోని ఫామ్‌హౌస్‌లో శనివారం రాత్రి సల్మాన్‌ఖాన్‌ను పాము కాటేసింది. వెంట‌నే అత‌నిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే సల్మాన్ ఖాన్ విషం లేని పాము కాటుకు గురైనట్లుగా బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఖాన్‌పై పెద్దగా ప్రభావం లేదని చెప్పారు. పాము కాటు తర్వాత సల్మాన్ ఖాన్ నవీ ముంబైలోని కమోతే ప్రాంతంలోని MGM (మహాత్మా గాంధీ మిషన్) ఆసుపత్రిలో చేరాడు.

చికిత్స అనంతరం సల్మాన్ ఖాన్ ఈరోజు ఉదయం 9 గంటలకు తన పన్వెల్ ఫామ్‌హౌస్‌కి తిరిగి వచ్చారు. సల్మాన్‌ఖాన్‌ పరిస్థితిని పర్యవేక్షించడానికి రాత్రంతా డాక్టర్లు అబ్జ‌ర్వేష‌న్‌లో ఉంచారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తన ఫామ్‌హౌస్‌లో ఉన్నాడు. ఆయ‌న ఆరోగ్యం బాగానే ఉంద‌ని, ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌న‌క్క‌ర్లేద‌ని సన్నిహితులు చెబుతున్నారు.

ఇక ఇదిలా ఉండగా స‌ల్మాన్ ఖాన్ ఇటీవ‌ల ముంబైలో జరిగిన ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా హాజరై ఈవెంట్ ను మరోస్థాయికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు సల్మాన్ తో కలిసి మరో వేదికపై కూడా మన హీరోలు హల్చల్ చేశారు.

ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకి కలసి స్టెప్పులేసి సందడి చేశారు. సల్మాన్ హోస్ట్ చేస్తున్న గ్రాండ్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ కు అలియా, రాజమౌళితో సహా హాజరైన హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ మోస్ట్ ఫన్నీ హంగామా సృష్టించారు. ఈ స్టేజ్ పైనే ఎన్టీఆర్, చరణ్ సల్మాన్ తో ఆర్ఆర్ఆర్ సినిమాలో మాస్ సాంగ్ హిందీ వెర్షన్ నాచో నాచోకి కలిపి స్టెప్పేశారు. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైర‌ల్ అయింది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM