Sai Pallavi : సాయిప‌ల్ల‌వి సీక్రెట్‌గా మ‌హేష్ బాబును క‌లిసిందా ? ఫొటోలు వైర‌ల్‌..!

Sai Pallavi : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, మ‌హాన‌టి ఫేమ్ కీర్తి సురేష్ హీరో హీరోయిన్లు వ‌చ్చిన లేటెస్ట్ చిత్రం.. స‌ర్కారు వారి పాట‌. ఈ సినిమా తొలి రెండు రోజులు నెగెటివ్ టాక్‌ను సాధించినా.. క్ర‌మంగా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల దిశ‌గా ముందుకు సాగుతోంది. దీంతో మ‌హేష్ హ్యాట్రిక్ విజ‌యాల‌ను సాధించిన‌ట్లు అయింది. ఈ క్ర‌మంలోనే మ‌హేష్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక ఈ మూవీని చూసేందుకు ఎంతో మంది ఆస‌క్తిని చూపిస్తున్నారు. అయితే తాజాగా సాయిప‌ల్లవి కూడా ఈ మూవీని చూసింది. ఈ క్ర‌మంలోనే ఆమె ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.

సాయిప‌ల్లవి చివ‌రిసారిగా న‌టించిన చిత్రం శ్యామ్ సింగ‌రాయ్‌. ఈ మూవీ డీసెంట్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ త‌రువాత ఆమె ఏ ఒక్క కొత్త సినిమాకు కూడా సంత‌కం చేయ‌లేదు. దీంతో ఆమెకు అస‌లు ఏమైంది ? సినిమాలు చేయ‌డం మానేస్తుందా ? పెళ్లి చేసుకోబోతుందా ? అని పుకార్లు వ‌చ్చాయి. అయితే ఆమె స్నేహితులు ఈ వార్త‌ల‌ను ఖండించారు. స‌రైన క‌థ ల‌భించ‌డం లేద‌ని.. అలా దొరికితే ఆమె త‌ప్ప‌క సినిమాలు చేస్తుంద‌ని చెప్పారు. దీంతో ఆ వార్త‌లు అబ‌ద్ధ‌మ‌ని తేలిపోయాయి. ఇక తాజాగా సాయి ప‌ల్ల‌వి మ‌రోమారు బ‌య‌ట క‌నిపించ‌డంతో ఆమె ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఆమె హైద‌రాబాద్లోని పీవీఆర్ ఆర్కే కాంప్లెక్స్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తూ క‌నిపించింది.

Sai Pallavi

తాజాగా సాయిప‌ల్ల‌వి మ‌హేష్ బాబు స‌ర్కారు వారి పాట మూవీ చూసింద‌ని.. అందుక‌నే ఆ కాంప్లెక్స్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తూ క‌నిపించింద‌ని తెలుస్తోంది. అయితే ఆమె బ‌య‌ట‌కు వ‌చ్చిన స‌మ‌యంలో ముఖానికి అడ్డుగా స్కార్ఫ్ క‌ట్టుకుని ఉంది. అయిన‌ప్ప‌టికీ ఆమెను సుల‌భంగా గుర్తు ప‌ట్ట‌వ‌చ్చు. అయితే ఆమె ఇలా మ‌హేష్ బాబు సినిమా చూడ‌డంతో.. ఇత‌ర తార‌ల‌కు కూడా ఈ మూవీ ఎంతో న‌చ్చింద‌ని.. అందుక‌నే సినిమాను ఆద‌రిస్తున్నార‌ని మ‌హేష్ ఫ్యాన్స్ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇక మ‌హేష్ బాబు త్వ‌ర‌లోనే త్రివిక్ర‌మ్ తో సినిమా చేయ‌నున్నారు. అందులో పూజా హెగ్డెను హీరోయిన్‌గా ఇప్ప‌టికే ఎంపిక చేశారు. దీని త‌రువాత మ‌హేష్ రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో సినిమా చేస్తారు. ఈ మూవీ వ‌చ్చే ఏడాది ప్రారంభం కానున్న‌ట్లు తెలుస్తోంది. దీనికి రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ‌ను సిద్ధం చేస్తున్నారు. ఆఫ్రికా అడ‌వుల నేప‌థ్యంలో యాక్ష‌న్, అడ్వెంచ‌ర్‌, థ్రిల్ల‌ర్‌గా ఈ మూవీ ఉంటుంద‌ని ఆయ‌న హింట్ ఇచ్చారు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM