Sreemukhi : బుల్లితెరపై ఎంతో సందడి చేసే యాంకర్ ఎవరు.. అనే విషయానికి వస్తే.. మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేర్లలో యాంకర్ శ్రీముఖి పేరు తప్పకుండా ఉంటుంది. ఈమె అనేక టీవీ షోలను చేస్తూ బిజీగా ఉంది. అలాగే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తోంది. అయితే ఈ అమ్మడు తాజాగా నెటిజన్ల ట్రోలింగ్‌కు గురవుతోంది. ఈమె చేసిన ఒక పని వల్ల నెటిజన్లు భారీగా ఆమెను విమర్శిస్తున్నారు. డబ్బులు ఇస్తే ఏ పని అయినా చేస్తావా.. అంటూ శ్రీముఖిని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇక అసలు విషయానికి వస్తే..
ప్రస్తుతం మనకు అనేక రకాల యాప్స్ ఫోన్లలో అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో బెట్టింగ్ యాప్స్ ఒకటి. ఇవి మనల్ని ఎంతో ఆకర్షిస్తుంటాయి. కానీ వాటిని నమ్మి వాటిలో డబ్బు పెడితే.. ఉన్నదంతా ఊడ్చేస్తారు తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇలాంటి యాప్స్ బారిన పడి చాలా మంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొందరు ప్రాణాలను కోల్పోగా.. కొందరు తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో చిక్కుకుపోతున్నారు. అయితే ఇలాంటి యాప్స్‌ను కొందరు సెలబ్రిటీలు ప్రమోట్ చేసి చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా అలాంటి పరిస్థితే యాంకర్ శ్రీముఖికి ఎదురవుతోంది. ఆమె కూడా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. అయితే దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీముఖిని దారుణంగా విమర్శిస్తున్నారు.
శ్రీముఖి.. నీకు అసలు సిగ్గుందా.. డబ్బులు ఇస్తే ఎలాంటి పని అయినా చేస్తావా.. నిన్ను యాంకర్‌గా ఎంతో అభిమానిస్తున్నాం.. కానీ నువ్వు చేస్తున్నదేమిటి ? ఇలా బెట్టింగ్ యాప్‌లను ఎందుకు ప్రోత్సహిస్తున్నావు ? వాటిని ఇన్‌స్టాల్ చేసుకోవాలని మాకు ఎందుకు చెబుతున్నావు ? వాటిని ఎందుకు ప్రమోట్ చేస్తున్నావు ? అంటూ శ్రీముఖిపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఆమెను భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అయితే దీనిపై శ్రీముఖి స్పందించాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…