Sai Pallavi : సూపర్ స్టార్ మహేష్ బాబు, మహానటి ఫేమ్ కీర్తి సురేష్ హీరో హీరోయిన్లు వచ్చిన లేటెస్ట్ చిత్రం.. సర్కారు వారి పాట. ఈ సినిమా తొలి రెండు రోజులు నెగెటివ్ టాక్‌ను సాధించినా.. క్రమంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల దిశగా ముందుకు సాగుతోంది. దీంతో మహేష్ హ్యాట్రిక్ విజయాలను సాధించినట్లు అయింది. ఈ క్రమంలోనే మహేష్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మూవీని చూసేందుకు ఎంతో మంది ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే తాజాగా సాయిపల్లవి కూడా ఈ మూవీని చూసింది. ఈ క్రమంలోనే ఆమె ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
సాయిపల్లవి చివరిసారిగా నటించిన చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ మూవీ డీసెంట్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ తరువాత ఆమె ఏ ఒక్క కొత్త సినిమాకు కూడా సంతకం చేయలేదు. దీంతో ఆమెకు అసలు ఏమైంది ? సినిమాలు చేయడం మానేస్తుందా ? పెళ్లి చేసుకోబోతుందా ? అని పుకార్లు వచ్చాయి. అయితే ఆమె స్నేహితులు ఈ వార్తలను ఖండించారు. సరైన కథ లభించడం లేదని.. అలా దొరికితే ఆమె తప్పక సినిమాలు చేస్తుందని చెప్పారు. దీంతో ఆ వార్తలు అబద్ధమని తేలిపోయాయి. ఇక తాజాగా సాయి పల్లవి మరోమారు బయట కనిపించడంతో ఆమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఆమె హైదరాబాద్లోని పీవీఆర్ ఆర్కే కాంప్లెక్స్ నుంచి బయటకు వస్తూ కనిపించింది.

తాజాగా సాయిపల్లవి మహేష్ బాబు సర్కారు వారి పాట మూవీ చూసిందని.. అందుకనే ఆ కాంప్లెక్స్ నుంచి బయటకు వస్తూ కనిపించిందని తెలుస్తోంది. అయితే ఆమె బయటకు వచ్చిన సమయంలో ముఖానికి అడ్డుగా స్కార్ఫ్ కట్టుకుని ఉంది. అయినప్పటికీ ఆమెను సులభంగా గుర్తు పట్టవచ్చు. అయితే ఆమె ఇలా మహేష్ బాబు సినిమా చూడడంతో.. ఇతర తారలకు కూడా ఈ మూవీ ఎంతో నచ్చిందని.. అందుకనే సినిమాను ఆదరిస్తున్నారని మహేష్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక మహేష్ బాబు త్వరలోనే త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నారు. అందులో పూజా హెగ్డెను హీరోయిన్‌గా ఇప్పటికే ఎంపిక చేశారు. దీని తరువాత మహేష్ రాజమౌళి డైరెక్షన్‌లో సినిమా చేస్తారు. ఈ మూవీ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. దీనికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేస్తున్నారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యాక్షన్, అడ్వెంచర్, థ్రిల్లర్‌గా ఈ మూవీ ఉంటుందని ఆయన హింట్ ఇచ్చారు.