Sai Pallavi : విరాట పర్వం సినిమా రిలీజ్ ఏమోగానీ సాయిపల్లవి అనవసరంగా వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకుంది. ఆమె అసలు అలా ఎన్నడూ మాట్లడలేదు. తన పనేదో తాను చేసుకుంటుంది. ఆమె గ్లామర్ షో కూడా చేయదు. ఎలాంటి యాడ్స్‌లోనూ నటించదు. ఆమెకు ఒక భిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది. కనుకనే చాలా మంది ఆమెను ఇష్టపడతారు. ఇప్పటి వరకు అసలు ఎలాంటి వివాదాల్లోనూ ఆమె చిక్కుకోలేదు. కానీ విరాట పర్వం మూవీ రిలీజ్‌కు ముందు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అనవసరంగా ఇబ్బందుల్లో ఇరుక్కుంది. ఈ క్రమంలోనే ఆమెపై కేసు నమోదు కాగా.. దాని నుంచి ఆమె బయట పడే సూచనలు కనిపించడం లేదు.
నటి సాయి పల్లవి విరాట పర్వం రిలీజ్‌కు ముందు మాట్లాడుతూ.. కాశ్మీర్‌లో కాశ్మీర్ పండిట్ల హత్యలు, యూపీలో గోహత్యలను చేసిన వారిని చంపడం.. రెండూ ఒకటేనని.. పెద్దగా తేడా ఏమీ లేదని సాయి పల్లవి కామెంట్స్ చేసింది. దీంతో ఆమె వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. అప్పటి వరకు ఆమె అంటే ఎంతో ఇష్టపడిన వారు కూడా ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉందని గ్రహించడంతో సాయిపల్లవి క్షమాపణలు చెప్పింది. కానీ ఓ వ్యక్తి మాత్రం ఆమెపై కేసు పెట్టాడు. దీంతో హైకోర్టు కేసును విచారించింది.

అయితే సాయిపల్లవిపై కేసు నమోదు చేసినందుకు గాను పోలీసులు ఆమెకు గత నెల 21వ తేదీన నోటీసులు జారీ చేశారు. కాగా ఆ నోటీసులను రద్దు చేయాలని కోరుతూ ఆమె హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే కేసును విచారించిన హైకోర్టు ఆమె పిటిషన్‌ను కొట్టి వేసింది. ఆమె పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో సాయిపల్లవికి ఈ కేసులో చిక్కులు తప్పడం లేదని అర్థమవుతోంది. అయితే దీనిపై తరువాత ఏం జరుగుతుందన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఆమె ఈ విషయంపై ఇంకా ముందుకు ఎలా కొనసాగుతుందో చూడాల్సి ఉంది.