Amazon : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన ప్రైమ్ మెంబర్ల కోసం మరో అద్భుతమైన సేల్‌ను నిర్వహించనుంది. ప్రైమ్ డే సేల్ పేరిట నిర్వహించనున్న ఈ సేల్ ఈ నెల 23, 24 తేదీల్లో కొనసాగనుంది. ఇందులో భాగంగా అనేక రకాల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను అందించనున్నారు. ఈ క్రమంలోనే పలు కొత్త ప్రొడక్ట్స్‌ను కూడా లాంచ్ చేయనున్నారు. ముఖ్యంగా ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఆడియో ఉత్పత్తులపై తగ్గింపు ధరలను అందించనున్నారు.
అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో భాగంగా ఐసీఐసీఐ లేదా ఎస్‌బీఐ బ్యాంక్ కార్డులతో వస్తువులను కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. టీవీలు, స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లపై ఈ డిస్కౌంట్‌ను పొందవచ్చు. అలాగే రెండు రోజుల సేల్‌లో రోజూ సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య వావ్ డీల్స్ పేరిట ప్రత్యేక సేల్ కొనసాగుతుంది. ఇందులో మొబైల్స్, యాక్ససరీలపై 40 శాతం, ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్స్, స్మార్ట్ వాచ్‌లు, వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌పై 75 శాతం తగ్గింపు ధరలను పొందవచ్చు.

ఈ సేల్‌లో శాంసంగ్, బోట్, ఇంటెల్, లెనోవో, సోనీ, బజాజ్ తదితర 400 బ్రాండ్లకు చెందిన 30వేలకు పైగా ఉత్పత్తులను కొత్తగా లాంచ్ చేసి విక్రయించనున్నారు. దీంతోపాటు అనేక ఇతర ఉత్పత్తులపై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లను అందించనున్నారు. ఇక ఈ సేల్ కేవలం అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. జూన్ 23న అర్థరాత్రి ప్రారంభం అయ్యే ఈ సేల్ జూన్ 24 వరకు కొనసాగుతుంది. ఇక అమెరికాలో అయితే జూలై 12, 13 తేదీల్లోనే ఈ సేల్‌ను కొనసాగించనున్నారు. ఇక ప్రైమ్ మెంబర్లకు మాత్రమే ఈ సేల్ అందుబాటులో ఉండగా.. ఆ మెంబర్‌షిప్ లేని వారు రూ.179 నెలకు చెల్లించి ప్రైమ్ సభ్యత్వాన్ని పొందవచ్చు. అలాగే 3 నెలలకు అయితే అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ రూ.459, ఏడాదికి రూ.1499 అవుతుంది. దీంతో మెంబర్‌షిప్‌ను పొంది ఈ సేల్‌లో పాల్గొని తగ్గింపు ధరలకే ఆయా వస్తువులను కొనుగోలు చేయవచ్చు.