Sada : సదా.. ఒకప్పుడు కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన అందాల నటి. నితిన్ హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాతో పరిచయమైంది. ఆ సినిమాలో వెళ్లవయ్యా.. వెళ్లు.. వెళ్లూ అంటూ లంగా ఓణీలో మెరుస్తూ కుర్ర హృదయాలను దోచుకుంది. ఈ సినిమా హిట్ అవ్వడంతో సదాకు వరుస అవకాశాలు వచ్చాయి. సదా కెరీర్‌లో జయంతోపాటు అపరిచితుడు సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించినప్పటికీ అనుకున్న స్థాయిలో ఆమెకు ఆఫర్లు రాలేదు. దీంతో కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సదా.. ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చింది.
బుల్లితెరపై పలు షోలకు న్యాయనిర్ణేతగా వ్యహరిస్తునే మరోవైపు ఓటీటీలో వెబ్ సిరీస్ చేసింది. తాజాగా హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ తో మళ్లీ ఫామ్ లోకి సదా వచ్చింది. ఈ క్రమంలోనే వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్ గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చిన రిపోర్టర్ తో సదా చెప్పిన సమాధానం మైండ్ బ్లాకింగ్ గా ఉంది. సదా మాట్లాడుతూ.. ప్రజెంట్ లైఫ్ స్టైల్ లో 10 మంది పెళ్లి చేసుకుంటే 5 మంది మాత్రమే కలిసున్నారని.. మిగతా 5 మంది విడాకులు తీసుకుని ఎవరి లైఫ్ వాళ్ళు బ్రతుకుతున్నారని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ పరోక్షంగా సమంత, చైతన్య విడాకులపై ముడిపడి ఉండడం గమనార్హం. అంతేకాదు తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో కూడా సదా చెప్పుకొచ్చింది.

నా జీవితం నా చేతుల్లోనే ఉంది. నా లైఫ్ నేను చాలా హ్యాపీగా లీడ్ చేసుకుంటున్నాను. పార్టీలకు, పబ్బులకు వెళ్ళను. నా జీవితం నాకు నచ్చినట్లే బ్రతకాలనుకుంటున్నాను. ఎవరో వచ్చి నా జీవితాన్ని ఉద్ధరించాలని అనుకోను. నేను పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తి వెజిటేరియన్ ఉండాలని కోరుకుంటున్నాను. డబ్బు లేకపోయినా ఫర్లేదు.. కానీ మంచి మనసు ఉండాలి. నాపై నా డబ్బుపై ఆధార పడకూడదు అంటూ చెప్పుకొచ్చింది సదా. దీంతో నెటిజన్స్ కూడా సదాకు సపోర్ట్ చేస్తున్నారు. ఆమె చెప్పిన దాంట్లో తప్పు లేదంటూ ప్రజెంట్ మ్యారేజ్ లైఫ్ స్టైల్ అలాగే ఉందంటూ కామెంట్ చేస్తున్నారు.