Liger Movie First Review : రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ల కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం.. లైగర్. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. గతంలో లేని విధంగా భిన్నమైన కథాంశంతో మూవీని తెరకెక్కిస్తుండడంతో లైగర్‌పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని ఆగస్టు 22వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఇక ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. పూరీ కనెక్ట్స్, కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇక లైగర్ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. దీంట్లో విజయ్‌కు తల్లిగా రమ్యకృష్ణ కనిపించనున్నారు. ట్రైలర్‌లో ఆమె మాస్ డైలాగ్‌లను చూస్తే సినిమా హిట్ పక్కా అని అంటున్నారు. ఇక ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావల్సి ఉన్నా అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు ఈ మూవీని ఆగస్టు 25న రిలీజ్ చేయనున్నారు. ఇందుకుగాను ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.

కాగా ఈ మూవీలో అనేక మంది ప్రముఖ నటీనటులు నటించారు. దీంతో చిత్ర బృందం మొత్తం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఇక ఈ మూవీకి సంబంధించిన మొదటి రివ్యూ బయటకు వచ్చేసింది. ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సంధు లైగర్ మూవీకి రివ్యూ ఇచ్చారు. ఈ మేరకు ఆయన తన సోషల్ ఖాతాలో రివ్యూను పోస్ట్ చేశారు.
లైగర్ ఒక పైసా వసూల్ మాస్ ఎంటర్‌టైనర్. విజయ్ దేవరకొండ చాలా బాగా చేశారు.. మాస్ ప్రేక్షకులను ఆయన ఎంతగానో ఆకట్టుకుంటారు. లైగర్ మూవీ ప్రేక్షకులను తప్పక అలరిస్తుంది.. అంటూ ఉమైర్ సంధు రివ్యూ ఇచ్చారు. దీంతో ఆయన పోస్ట్ వైరల్‌గా మారింది. అయితే గతంలోనూ ఈయన పలు తెలుగు మూవీలను ముందుగానే చూసి రివ్యూలు ఇచ్చారు. వాటిల్లో కొన్ని ఫ్లాప్ కాగా.. కొన్ని మాత్రం హిట్ అయ్యాయి. మరి లైగర్ రిజల్ట్ ఎలా వస్తుందో చూడాలి.