Saami Saami Song : అల్లు అర్జున్, రష్మిక ప్రధాన పాత్రలలో సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బన్నీని రష్మిక సామి.. అని పిలిస్తే.. రష్మికను బన్నీ.. అమ్మి అని పిలిచేవాడు. అది కూడా చిత్తూరు జిల్లా యాసలో. ఎందుకంటే పుష్ప సినిమా చిత్తూరు జిల్లాలో జరిగే శేషాచల అడవుల్లోని ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది కాబట్టి. అయితే వారి పేర్లతో రాక్ స్టార్ దేవి శ్రీ సామి సామి అనే సాంగ్ ప్లాన్ చేయగా, ఇది విడుదలై మంచి ఆదరణ పొందింది.
సామీ సామీ పాటకు భారీ స్పందన వస్తున్న నేపథ్యంలో పలువురు వ్యక్తులు ఈ పాటకు కవర్ సాంగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. హీరోయిన్ రేఖా భోజ్ దాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకుంది. ఈ సాంగ్ రిచ్‌గా ఉండాలని, ఒరిజినల్ సాంగ్‌ని తలదన్నేలా ఉండాలని ఎంతో కష్టపడింది. ఏకంగా ఈ సాంగ్ కోసం ఆమె రెండు బంగారు గాజులు అమ్ముకుందంటే ఆ డెడికేషన్ ను అర్థం చేసుకోవచ్చు.
అందం, అభినయం, ఆరబోతలో తగ్గేదే లేదు.. అంటూ దూసుకుపోతున్న ఈ విశాఖ బ్యూటీ.. అవకాశాలు లేకపోయినా, వేషాలు రాకపోయినా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తోంది. వైజాగ్‌లో ఓ స్టుడియో స్టార్ట్ చేసిన రేఖా భోజ్.. పలు హాట్ వీడియోలు చేస్తూ ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే ‘పుష్ప’ సినిమాలోని సామీ సామీ పాటను కవర్ సాంగ్ గా చేసింది ఈ వైజాగ్ చిన్నది.
ఒరిజినల్ సాంగ్ మాదిరిగా రేఖ కవర్ సాంగ్ ట్రై చేయగా, దానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. సాంగ్ షూట్ చేస్తున్నపుడు వర్షం పడినా కూడా లెక్క చేయకుండా చేశారట. అందుకే ఆ కష్టానికి ప్రతిఫలం కోరుకుంటూ సపోర్ట్ చేయండని సోషల్ మీడియా వేదికగా వేడుకుంది రేఖా భోజ్. ‘చాలా కష్టపడి చేశాను.. రెండు గాజులు అమ్ముకున్నా.. మీకు నచ్చితే మీ సోషల్ మీడియా ఖాతాలలో ఒక్క షేర్ చేసి సపోర్ట్ అందించండి” అని ఆమె పోస్ట్ పెట్టింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…