Bigg Boss 5 : బిగ్ బాస్ హౌజ్‌లో వాతావరణం చాలా హాట్ హాట్‌గా ఉంటోంది. ఫైనల్ దగ్గరికి వస్తున్న క్రమంలో ఎవరి లాజిక్స్ వారు అమలు చేస్తూ గేమ్ ఆడుతున్నారు. కొందరు గ్రూపులుగా గేమ్ ఆడుతుంటే మరి కొందరు సోలోగా గేమ్ ఆడేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే గత పది వారాల నుండి కెప్టెన్ బ్యాండ్ కోసం ఎంతగానో శ్రమిస్తున్న మానస్ ఎట్టకేలకు విజేతగా నిలిచాడు. రింగ్ ఈజ్ కింగ్ టాస్క్‌లో ఎవరు రింగ్‌ను చివరి వరకు పట్టుకుంటారో వాళ్లే కెప్టెన్‌గా నిలుస్తారు.
టాస్క్‌లో మొదటగా ఆనీ మాస్టర్ కిందపడిపోయింది. ఆ తరువాత సిరి కింద పడిపోయింది. చివర్లో ప్రియాంక రెండో చేతిని వాడడంతో చివరకు మానస్ టాస్క్‌లో గెలిచినట్టు అయింది. దీంతో ఇంటి తదుపరి కెప్టెన్‌గా మానస్ బాధ్యతలు తీసుకున్నాడు. దాంతో కెప్టెన్ మానస్ కాజల్‌కు సారీ చెప్పి ఆమెతో గొడవలకు ఫుల్‌స్టాప్ పెట్టేశాడు. మానస్, కాజల్, సన్నీ ముగ్గురు కలిసి తాము ఒక్కటే అనే సందేశాన్ని తెలియజేశారు.
మానస్ కెప్టెన్ అయినందుకు మానస్‌కి ముద్దు పెట్టాడు సన్నీ. వెంటనే మానస్ కూడా సన్నీకి ముద్దు పెట్టాడు. ఏరా పెదవుల మీద ముద్దు పెడతావా ? నేను ఇంకా వర్జిన్‌రా.. ఇంత వరకు ఎవ్వరికీ పెట్టలేదు.. అని సన్నీ అనడంతో.. కాజల్ షాకై చూసింది. ఇది నిజం నమ్ము అని సన్నీ అంటాడు. ఇక ఎలిమినేషన్ నుంచి సేవ్ అయ్యేందుకు బిగ్‌బాస్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ప్రవేశపెట్టాడు. ‘నిప్పులే శ్వాసగా.. గుండెలో ఆశగా’ టాస్క్‌లో మీ ఫొటో కాలకుండా చూసుకోవాలని, చివరి వరకు ఎవరి ఫొటో కాలకుండా ఉంటుందో ఆ కంటెస్టెంట్‌కు ఈ పాస్ దక్కుతుందని ప్రకటించాడు.
టాస్క్‌లో భాగంగా ఫైర్ ఇంజన్ అలారమ్ మోగగా రవి, షణ్ముఖ్ మొదట ట్రక్ ఎక్కారు. వీరికి మానస్, శ్రీరామ్ ఫొటోలు వచ్చాయి. షణ్ను సేవ్ చేసే అవకాశం మానస్‌కిద్దామంటే రవి మాత్రం శ్రీరామ్‌కే ఇద్దామని ఒప్పించాడు. అలా మానస్ ఫొటో మంటల్లో కాలిపోయింది. నెక్స్ట్ రౌండ్‌లో సన్నీ, మానస్ ట్రక్ ఎక్కారు. వీరి ఎదుట రవి, యానీ మాస్టర్ ఫొటోలు రాగా.. ఏకాభిప్రాయంతో రవి ఫొటోను కాల్చేశారు.
షణ్ను, సిరిలు ట్రక్ ఎక్కగా వారు పింకీని కాకుండా సన్నీని సేవ్ చేశారు. తర్వాత యానీ, శ్రీరామ్‌ల వంతు రాగా జనాల ఓటింగే నాకు ముఖ్యం, ఈ పాస్ అవసరం లేదన్నాడు షణ్ను. ఆడియన్స్ సపోర్ట్‌తోనే ఇక్కడిదాకా వచ్చాను, వారి డెసిషన్‌తోనే వెళ్లిపోవాలని ఉందని చెప్పుకొచ్చింది సిరి. వీళ్లిద్దరూ తమకీ పాస్ అవసరం లేదని చెప్పినప్పటికీ యానీ, శ్రీరామ్ ఆలోచించుకుని సిరిని సేవ్ చేశారు. దీంతో ఆమె సంతోషంతో షణ్నును హత్తుకుని అతడికి ఐ లవ్‌యూ చెప్పింది.
ఇక ప్రియాంక, కాజల్.. శ్రీరామ్, సిరిలలో నుంచి సిరిని సేవ్ చేశారు. యానీ, ప్రియాంకలకు సన్నీ, కాజల్ ఫొటోలు వచ్చాయి. యానీ.. ఆ రెండు ఫొటోలు కాల్చేద్దామని చెప్పింది. కానీ పింకీ అది తప్పని వారించడంతో ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చి కాజల్ ఫొటోను కాల్చేసి సన్నీని సేవ్ చేశారు.
ఇక మానస్, కాజల్‌లకు యానీ, సిరి ఫొటోలు వచ్చాయి. ఇద్దరూ ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. ఇద్దరూ కాలిపోతే సన్నీ గేమ్‌లో ఉంటాడని కాజల్ అభిప్రాయపడింది. ఎట్టకేలకు కాజల్.. సన్నీకే ఎవిక్షన్ పాస్ తెప్పించిందని సమాచారం. ఈ విషయంపై నేడు క్లారిటీ రానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…