Cool Drink : మనం తినే ఆహారంలో లేదా తాగే ద్రవాల్లో బల్లి పడిందని తెలిస్తే.. అప్పుడు మనకు కలిగే పరిస్థితిని వర్ణించలేం. ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుంది. కొందరికి వాంతులు అవుతాయి. ఇక కొందరికి ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది. అయితే అక్కడ అలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. కానీ ఆ రెస్టారెంట్ వారు ప్రవర్తించిన తీరు పట్ల కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓ మెక్ డొనాల్డ్స్ ఔట్‌లెట్‌లో ఇటీవలే ఓ కస్టమర్ తాగుతున్న కూల్ డ్రింక్‌లో బల్లి ఉందన్న వార్త వైరల్ అయింది. సదరు కస్టమర్ ఆ కూల్‌డ్రింక్ వీడియోను షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. అయితే ఆ కస్టమర్ చేసిన ఫిర్యాదును అందుకున్న అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది వెంటనే స్పందించారు. ఆ రెస్టారెంట్‌పై దాడులు నిర్వహించారు. కస్టమర్ ఫిర్యాదు మేరకు ఆ రెస్టారెంట్‌పై రూ.1 లక్ష జరిమానా విధించారు. అంతేకాకుండా రెస్టారెంట్‌కు సీల్ వేశారు. రెండు రోజుల పాటు మొత్తం క్లీన్ చేసిన అనంతరం అధికారులు మరోమారు తనిఖీలు నిర్వహిస్తారని.. వారు సంతృప్తి చెందితేనే మళ్లీ రెస్టారెంట్‌ను ఓపెన్ చేసేందుకు అనుమతులు ఇస్తామని వెల్లడించారు.

ఇక ఈ సంఘటనపై బాధితుడు ఈ వివరాలను వెల్లడించాడు. తాను, తన ఫ్రెండ్స్ ఆ రెస్టారెంట్ లో కూల్‌డ్రింక్స్ తాగుతున్నామని.. అయితే ఒక దాంట్లో బల్లి కనిపించిందని.. దీనిపై వెంటనే ఆ రెస్టారెంట్ సిబ్బందిని ప్రశ్నించామని అన్నారు. అయితే చాలా సేపటి వరకు వారు స్పందించలేదని.. చివరకు తమ కూల్‌డ్రింక్స్‌కు గాను రూ.300 రీఫండ్ ఇస్తామని చెప్పారని.. దీంతో వారి ప్రవర్తన నచ్చక తాము అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. అయితే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవడం సంతృప్తినిచ్చిందన్నారు.
@normmacdonald @rory_macdonald @Amy__Macdonald @MacDoesIt @LizMacDonaldFOX @HelenJMacdonald @HelenJMacdonald @frankiemacd @Euan_MacDonald @tv9gujarati @sandeshnews @anjanaomkashyap @htTweets @TimesNow @timesofindia @timesofindia pic.twitter.com/Zb54cPp5bD
— Bhargav joshi (@Bhargav21001250) May 23, 2022
కాగా ఈ విషయంపై అటు మెక్ డొనాల్డ్స్ కూడా స్పందించింది. తాము తమ అన్ని రెస్టారెంట్‌లలో 42 రకాలకు పైగా సేఫ్టీ ప్రమాణాలను పాటిస్తామని.. ఎల్లప్పుడూ రెస్టారెంట్‌ను, కిచెన్‌ను పరిశుభ్రంగా ఉంచుతామని.. అందువల్ల ఇలాంటి సంఘటనలు జరిగేందుకు చాన్సే లేదని అన్నారు. అయితే ఈ సంఘటన ఎలా జరిగిందో తాము తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని.. కస్టమర్లకు తమకు ముఖ్యమని.. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటామన్నారు. ఈ విషయంలో జరిగిన పొరపాటుకు చింతిస్తున్నామని తెలిపారు.