Nayanthara : నయనతార, విగ్నేష్ శివన్.. ఈ మధ్యకాలంలో తరచూ వీరి పేర్లు వార్తల్లో వినిపిస్తున్నాయి. వీరు ప్రేమికులుగా ఉంటూ ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్నారు. గత 6 ఏళ్ల నుంచి వీరు ప్రేమించుకుంటున్నారు. అనేక సందర్భాల్లో వీరు ఒకరికొకరు ఐ లవ్ యూ కూడా చెప్పుకున్నారు. అయితే వీరు ఇప్పటికే అనేక ఆలయాలను సందర్శించారు. నయనతార ఆయా సమయాల్లో నుదుటన సింధూరం కూడా ధరించింది. సాధారణంగా పెళ్లి అయిన వారే అలా ధరిస్తారు. కానీ నయనతార కూడా అలా సింధూరం ధరించడంతో వీరు పెళ్లి కూడా చేసుకుని ఉంటారని.. కాకపోతే బయటకు చెప్పడం లేదనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఆ వార్తలకు తెర దించుతూ ఎట్టకేలకు వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇది వరకే ప్రకటించారు. అందులో భాగంగానే జూన్ 9వ తేదీన వీరి పెళ్లికి ముహుర్తం కూడా కుదిరింది.
జూన్ 9వ తేదీన మహాబలిపురంలోని షెరటాన్ గ్రాండ్‌లో వీరి వివాహం జరగనుంది. ఈ క్రమంలోనే నయనతార, విగ్నేష్ శివన్‌లకు చెందిన పెళ్లి కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీరు తమ అభిమానులను తమ వివాహానికి రావాలని కోరారు. ఇక తమ పెళ్లికి వచ్చే అతిథులుకు డ్రెస్ కోడ్ కూడా విధించారు. ఇప్పటికే వీరు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను కూడా తమ వివాహానికి ఆహ్వానించారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌తోపాటు సూపర్ స్టార్ రజనీకాంత్‌లను వీరు ప్రత్యేకంగా ఆహ్వానించారు. దీంతో వీరు నయనతార, విగ్నేష్ శివన్‌ల పెళ్లికి హాజరవుతారని తెలుస్తోంది.

వేదికకు ఉదయం 8 గంటల వరకు రావాలని కార్డులో పేర్కొన్నారు. పెళ్లికి వచ్చే వారు నిర్దిష్టమైన డ్రెస్‌లను ధరించాలని సూచించారు. కురియన్ కోడియట్టు, ఒమన కురియన్ దంపతుల కుమార్తె నయనతార, శివకొళుందు, మీనాకుమారిల కుమారుడు విగ్నేష్ శివన్‌లకు జూన్ 9న గురువారం వివాహం జరుగుతుందని కార్డులో పేర్కొన్నారు. ఇక ఈ పెళ్లికి టాలీవుడ్ నుంచి కూడా పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. కాగా విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఇటీవలే విడుదలైన కాతు వాకుల రెండు కాదల్ చిత్రంలో నయనతార నటించింది. ఈ క్రమంలోనే ఈమె ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. పెళ్లి అనంతరం తాను నటిస్తున్న సినిమాలను నయనతార శరవేగంగా పూర్తి చేస్తుందని తెలుస్తోంది.