Roja : అక్టోబర్ 10వ తేదీన జరగబోయే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు గతంలో ఎప్పుడూ లేనంత విధంగా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మంచు ప్యానెల్, ప్రకాష్ రాజ్ ప్యానెల్ మధ్య పెద్ద ఎత్తున పోటీ ఏర్పడింది.
ఈ క్రమంలోనే కొందరు సీనియర్ నటీనటులు వారి మద్దతును తెలియజేస్తున్నారు. ఇప్పటికే కోట శ్రీనివాసరావు, నాగ బాబు వంటి వారు వారి మద్దతు తెలియజేయగా తాజాగా మా ఎన్నికలపై నటి ఎమ్మెల్యే రోజా స్పందించారు. ఈ క్రమంలోనే ఈమె మాట్లాడుతూ మా ఎన్నికలు ఈసారి ఎంతో హోరాహోరీగా సాగుతున్నాయి. అయితే ఈ ఎన్నికలలో తను లోకల్, నాన్ లోకల్ అనే అంశాలను దృష్టిలో పెట్టుకోలేదని తెలిపారు.
కేవలం తను ఎన్నికల మేనిఫెస్టోను మాత్రమే చూశానని, అందులో ఏ మ్యానిఫెస్టోలో అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే వారికే నా మద్దతు, వారి ప్యానల్ కే నా ఓటు.. అని ఈ సందర్భంగా రోజా మా ఎన్నికలపై స్పందించారు.