Hyderabad : హైదరాబాద్ నగర వాసులకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నగర వాసులు శనివారం మధ్యాహ్నం నుంచి బయటకు రాకూడదని హెచ్చరించింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కనుక అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని కోరింది.
ఈ క్రమంలోనే అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, అన్ని చోట్ల సహాయక చర్యలు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు బయటకు రాకూడదని కోరింది. నగర వాసులందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
ఇక ప్రజలు ఏవైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే 040-21111111 అనే టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయవచ్చని అధికారులు సూచించారు. శుక్రవారం కురిసిన వర్షానికే నగరంలో అనేక చోట్ల వరద నిలిచిపోయింది. కాలనీలు, బస్తీలు జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో నగరవాసులు మరింత అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచిస్తోంది.