Jabardasth : ప్రముఖ నటి, ఎమ్మెల్యే రోజా తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటించి అశేష ప్రేక్షకాదరణ పొందింది. ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి అక్కడ కూడా తనదైన శైలిలో రాజకీయం చేస్తూ.. ప్రజలకు సేవలందిస్తూ.. రాజకీయ నాయకురాలిగా అదరగొడుతోంది. మరోవైపు జబర్దస్త్ కామెడీ షో వంటి ప్రోగ్రామ్‌లకు జడ్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన పర్సనల్ విషయాలు కూడా తెలియజేస్తూ అలరిస్తూ ఉంటుంది. అయితే వెండితెరకు దూరంగా ఉన్న రోజా బుల్లితెరపై మాత్రమే అలరిస్తూ వస్తోంది. ముఖ్యంగా జబర్దస్త్‌కి జడ్జ్‌గా సత్తా చాటుతోంది.

నాగబాబు వెళ్లిపోయిన తర్వాత రోజానే జబర్దస్త్‌కి మెయిన్ పిల్లర్‌గా మారింది. అయితే గత కొద్ది రోజులుగా రోజా జబర్దస్త్ నుండి తప్పుకుందని వార్తలు వస్తున్నాయి. రీసెంట్‌గా మల్లెమాల ఎంటర్‌టైనమెంట్స్ రిలీజ్ చేసిన ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోమో చూస్తే రోజా ఇకపై జబర్దస్త్‌లో జడ్జిగా కాకుండా.. ఏపీ మంత్రివర్గంలో క్యాబినెట్ హోదాలో కనిపించబోతుందని పక్కాగా అర్ధమవుతోంది. అందుకే ఎన్నో సంవత్సరాలుగా తాను జడ్జిగా వ్యవహరిస్తున్న టాప్ టీవీ షోకి తాను తప్పుకొని కొత్త జడ్జిలకు ట్రైనింగ్ ఇస్తున్నట్లుగా ఉంది ప్రోమో. తనకు ఎంతో పేరు, గుర్తింపు తెచ్చిన ఎంటర్‌టైనమెంట్ ప్రోగ్రామ్ నుంచి రోజా తప్పుకోవడం చూస్తుంటే ఏపీ మంత్రిగా కన్ఫామ్ అయిందని ఫ్యాన్స్, టీవీలు చూస్తున్న ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న కేబినెట్ మంత్రుల్లో మెజార్టీ సభ్యులను తప్పించి కొత్తవారికి చోటు కల్పించబోతున్నట్టు ఏపీ సీఎం జగన్ స్వయంగా ప్రకటించారు. మహిళా కోటాలో తనకు మంత్రి పదవి దక్కితే ఈ షోలను మానేయాల్సి వస్తుందని తెలిసి.. ఇప్పటి నుంచి రోజా దూరంగా ఉంటుందని తెలుస్తోంది. అందుకే ఈ వారం జరిగిన ఎపిసోడ్‌లో కూడా రోజా కనిపించలేదేమోనని చర్చ మొదలయింది. మరి ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందనేది త్వరలో తెలియనుంది. రోజా కూడా జబర్దస్త్ నుండి తప్పుకుంటే ఆ కళే పోతుందని కొందరు అంటున్నారు.