Jio : దేశంలోని టెలికాం రంగంలో జియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అప్పట్లో జియో దెబ్బకు ఇతర టెలికాం కంపెనీలు బొక్క బోర్లా పడ్డాయి. ఒక జీబీ 4జి డేటాకు అప్పటి వరకు కంపెనీలు సుమారుగా రూ.250 వరకు వసూలు చేసేవి. కానీ జియో వచ్చాక ఆ ఖరీదు రూ.10కి పడిపోయింది. అలాగే ఉచిత కాల్స్, యాప్స్, జియో టీవీ, న్యూస్.. ఇలా అనేక సర్వీసులను ఒక్క జియో సిమ్‌తో ఉచితంగా పొందే వీలు కల్పించింది. దీంతో చాలా మంది కస్టమర్లు జియో వైపుకు మళ్లారు. అయితే మంది ఎక్కువైతే మజ్జిగ పలుచబడుతుందన్న చందంగా ఇప్పుడు జియో మారింది.
జియో సేవలు ఇప్పుడు మరీ అంత ఆకట్టుకునేలా లేవు. నెట్‌వర్క్ క్వాలిటీ కూడా తగ్గింది. అయినప్పటికీ ఇతర టెలికాం కంపెనీలకు పోటీగా నిలుస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త చందాదారులను చేర్పించుకుంటోంది. అయితే అప్పట్లో సృష్టించిన సంచలనం మాదిరిగా జియో మరో సంచలనానికి తెర తీయనుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే జియో త్వరలోనే 5జి సేవలను ప్రారంభించబోతుంది కాబట్టి.
దేశంలో ఇప్పటికే 5జి సేవలకు గాను స్పెక్ట్రమ్ వేలం ముగిసింది. ఇప్పటికే ఎయిర్‌టెల్‌తోపాటు జియో కూడా నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తున్నాయి. పలు మొబైల్ తయారీ కంపెనీలతో ఒప్పందం చేసుకుని పలు చోట్ల 5జి సేవలను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నాయి. అయితే ఈ విషయంలో జియోతోపాటు ఎయిర్‌టెల్ కూడా కాస్త ముందు వరుసలోనే ఉంది. ఇక 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నేపథ్యంలో ముకేష్ అంబానీ జియో 5జి సేవలను ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ మేరకు వార్తలు ఊపందుకున్నాయి.
దేశంలో 5జి స్పెక్ట్రమ్ వేలంలో జియో టాప్ బిడ్డర్‌గా నిలిచింది. 24,740 మెగా హెడ్జ్ స్పెక్ట్రమ్‌ను జియో రూ.88,078 కోట్లకు దక్కించుకుంది. ఇక దేశంలోని 22 సర్కిళ్లలో జియో తన 5జి సేవలను అందించనుంది. ఈ క్రమంలోనే ఆగస్టు 15న 5జి సేవలను ప్రారంభించడం ద్వారా జియో మరో సంచలనానికి తెర తీయనుందని తెలుస్తోంది. అదే జరిగితే ఈసారి జియో మరింత ముందుకు దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక జియో తరువాత ఎయిర్‌టెల్ 5జి సేవలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. మరి ఈ రెండింటిలో ఏ కంపెనీ ముందుగా 5జి సేవలను అందిస్తుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…