Samantha : టాలీవుడ్ డైనమిక్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ తన గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తూ అలరిస్తోంది. ఇక వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సమంతకు మరో భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈమెకు పుష్ప 2లో నటించే చాన్స్ వచ్చిందని సమాచారం. పుష్ప మొదటి పార్ట్‌లో ఈమె ఊ అంటావా పాట చేసి అలరించింది. అయితే రెండో పార్ట్ లో ఈమె ఐటమ్ సాంగ్ కాకుండా ఓ పాత్రలో నటిస్తుందని తెలుస్తోంది.
పుష్ప 2లో సమంత ఐటమ్ సాంగ్‌లో కాకుండా ఓ కీలకమైన పాత్రలో నటిస్తుందని సమాచారం. ఈమె క్యారెక్టర్‌ను ఇప్పటికే ఫైనల్ చేశారట. పుష్ప 2లో సెకండాఫ్‌లో రష్మిక పాత్ర శ్రీవల్లి చనిపోతుందని.. అయితే ఆమె జ్ఞాపకాల నుంచి బయట పడలేని పుష్పకు ఓదార్పుగా సమంత పాత్ర వస్తుందట. ఈ క్రమంలోనే ఆమె పాత్ర స్ట్రాంగ్‌గా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమే. ఇందులో నిజం ఎంత ఉంది.. అన్న విషయం తెలియాల్సి ఉంది.
ఇక పుష్ప మొదటి పార్ట్‌లో ఐటమ్ సాంగ్ చేయడం ద్వారా అటు సమంతకు కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ క్రమంలోనే ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇక బాలీవుడ్‌లో నటించేందుకు ఈమె ముంబైకి కూడా షిఫ్ట్ అయింది. ఈమె నటించిన శాకుంతలం, యశోద మూవీలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ఇటీవలే సమంత కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొనగా.. అందులో తన విడాకులపై మాట్లాడేందుకు ఈమె అంగీకరించలేదు. అయినప్పటికీ తమ విడాకులు అంత సామరస్యంగా ఏమీ జరగలేదని చెప్పి అందరినీ షాక్ కు గురిచేసింది. అయితే సమంత ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం లేదు. ఇందుకు కారణాలు తెలియాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…