Raviteja : గత కొంత కాలంగా సరైన హిట్స్ లేక ఇబ్బంది పడుతున్న రవితేజ క్రాక్ చిత్రంతో మంచి హిట్ కొట్టాడు. దీంతో వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి అనే సినిమాని ఇప్పటికే పూర్తి చేసిన రవితేజ .. శరత్ మండవ దర్శకత్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ’, త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ‘ధమాకా’మూవీ చేస్తున్నారు. రీసెంట్‌గా తన 70వ సినిమాగా తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ చేశారు.
నవంబర్ 5వ తేదీన ఉదయం 10:08 గంటలకు ఈ మూవీ టైటిల్‌తోపాటు ఫస్ట్‌లుక్ రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సుధీర్ వర్మ దర్శకుడు. ఇక 71వ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. బుధవారం మధ్యాహ్నం 12 : 06 నిమిషాలకు అనౌన్స్ మెంట్ రాబోతోంది. రవితేజ ఈ సినిమాలో కూడా నెవర్ బిఫోర్ అవతార్ లో కనిపించబోతున్నారని టాక్. అయితే వరుస సినిమాలు చేస్తున్న రవితేజ తన రెమ్యునరేషన్ రూ.18 కోట్ల మార్క్ కి సెట్ చేసినట్టు తెలుస్తోంది.
రవితేజ మళ్లీ ట్రాక్ లో పడడంతో వరుస సినిమాలను చేస్తూ, దానికి తగ్గట్లే రెమ్యునరేషన్ కూడా పెంచేశాడు. తన 70వ సినిమాకి అభిషేక్ నామాతోపాటు రవితేజ కూడా నిర్మాతగా వ్యవహరించనున్నాడు. కాబట్టి లాభాల్లో వాటా తీసుకోబోతున్నాడు. ఇదిలా ఉంటే టైగర్ నాగేశ్వరావు బయోపిక్. చాలా రోజులుగా ఇండస్ట్రీలో ఈ సినిమా తెరకెక్కనుందని వార్తలొస్తున్నాయి. కానీ ఇప్పటివరకు సెట్స్ పైకి వెళ్లలేదు.
ఈ సినిమాకి రవితేజ ఓకే చెప్పగా, దర్శకుడు వంశీ కృష్ణ రూపొందించనున్న ఈ సినిమాకి అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. రూ.50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకి ఒక్క రవితేజ రెమ్యునరేషనే రూ.18 కోట్లట. మరి ఈ రేంజ్‌లో రెమ్యునరేషన్ ఇస్తే రవితేజకి ఎంత వర్కవుట్ అవుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…