Pushpa Movie : అల వైకుంఠపురములో చిత్రం తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం పుష్ప. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీని సౌత్‌తో పాటు నార్త్‌లోనూ రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మాత్రమే నేరుగా రిలీజ్ అవుతుందని.. హిందీలో మాత్రం థియేటర్లలో విడుదల కాదని అంటున్నారు.
ఇప్పటికే ‘పుష్ప’ హిందీ డబ్బింగ్ హక్కుల్ని అమ్మేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. పుష్ప సినిమాను పాన్ ఇండియా సినిమాగా అనుకోకముందుగానే మైత్రీ మూవీస్ సంస్థ హిందీ డబ్బింగ్ హక్కులను అలవాటు ప్రకారం విక్రయించేశారు. తీరా ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అయిన తరువాత హిందీ హక్కులు కొనుక్కున్న వ్యక్తి థియేటర్లలో విడుదలకు అంగీకరించడం లేదు.
ఈ విషయంలో హీరో బన్నీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దాంతో మైత్రీ అధినేతలు హిందీ డబ్బింగ్ కొనుక్కున్న వ్యక్తితో డిస్కషన్లు స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. కొన్ని షరతుల మీద హిందీ విడుదలకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ అలా చేయడం వల్ల ఆదాయం ఎలా ఉంటుందో తెలియదు. కానీ, మైత్రీ మూవీస్ కు అదనపు వ్యయం తప్పదని తెలుస్తొంది.
అయితే డబ్బింగ్ రైట్స్ కొన్న వ్యక్తి పబ్లిసిటీ, థియేటర్ ఖర్చులు మైత్రీ మూవీస్ నే పెట్టుకుని, పర్సంటేజ్ ఇస్తే థియేటర్ విడుదలకు అంగీకరిస్తానని అంటున్నారట. లేదూ అంటే అగ్రిమెంట్ ప్రకారం యూ ట్యూబ్ లో విడుదల అవుతుందని చెబుతున్నారట. ఈ సమస్య ఎలా సాల్వ్ అవుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…