Jai Bheem Review : సూర్య, రిజిష విజయన్, లిజో మోల్ జోస్, మణికందన్, రావు రమేష్, ప్రకాష్ రాజ్, సంజయ్ స్వరూప్ తదితరులు ప్రధాన పాత్రలలో జ్ఞానవేల్ తెరకెక్కించిన చిత్రం జై భీమ్. ఓటీటీ వేదికగా విడుదలైన ఈ చిత్రంలో కష్టాన్నే నమ్ముకున్న గిరిజనుడు. ఉన్నదాంట్లో కష్టపడి తన భార్యా బిడ్డల్ని పోషించుకుంటున్న అతణ్ని చేయని నేరానికి ఒక దొంగతనం కేసులో పోలీసులు ఇరికిస్తారు.
బడుగు బలహీన వర్గాలకు చెందిన వారి కోసం మానవ హక్కుల కోసం ఉచితంగా కేసులు వాదించే చంద్రు (సూర్య)ను ఆశ్రయిస్తుంది ఆ వ్యక్తి భార్య. ఈ కేసును టేకప్ చేసిన సూర్యకు ఎదురైన అడ్డంకులు, చిక్కుముడులు ఏంటి..? రాజన్న.. మిగతా ఇద్దరు ఏమయ్యారు ? ఎవరికి న్యాయం జరిగింది ? అన్నది సినిమా కథ.
కేవలం కమర్షియల్ అంశాలను మాత్రమే కాకుండా సొసైటీకి ఎంతో అవసరమైన ఒక హార్డ్ హిట్టింగ్ కథను సగటు ప్రేక్షకులకు కనెక్టయ్యేలా.. వాళ్లందులో లీనమయ్యేలా దర్శకుడు తెరకెక్కించాడు. జ్ఞానవేల్ వాస్తవ ఘటనల ఆధారంగా ఒక గొప్ప కథను తీర్చిదిద్దుకుని.. దానికి పకడ్బందీ కథనాన్ని జోడిస్తే.. నిర్మాతగా.. నటుడిగా ఈ సినిమా కోసం ఎంత చేయాలో అంతా చేశాడు సూర్య.
తమిళనాడులో 90వ దశకంలో జరిగిన ఒక గిరిజనుడి లాకప్ డెత్ కేసు ఆధారంగా తీర్చిదిద్దుకున్న కథ ఇది. నిస్సహాయులుగా మారిన బాధితుల కోసం చంద్రు అనే ప్రముఖ మానవహక్కుల న్యాయవాది (తర్వాత జడ్జి కూడా అయ్యారు) హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి సుదీర్ఘ కాలం పోరాడి వారికి న్యాయం చేకూరేలా చేసిన సంచలన కేసు మూలం తీసుకొని సినిమా తెరకెక్కించారు.
హీరో కేసు గురించి స్టడీ చేశాక.. కోర్టులో వాదనలు మొదలైన దగ్గర్నుంచి ‘జై భీమ్’ ఒక థ్రిల్లర్ సినిమాలా మారిపోతుంది. కోర్ట్ రూం డ్రామా రక్తి కట్టేలా ఎంతో ఆసక్తికరంగా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు దర్శకుడు. ప్రతి సన్నివేశంలోనూ కొత్త విషయాలు తెలుస్తుంటాయి.
చివరి అరగంటలో ఓవైపు రావు రమేష్.. మరోవైపు ప్రకాష్ రాజ్ పాత్రలు కూడా అవసరమైన బలాన్నిచ్చాయి. చివర్లో వచ్చే హృద్యమైన సన్నివేశాలకు తోడు చక్కటి డైలాగ్స్ కూడా పడటం.. సూర్య పెర్ఫామెన్స్ కూడా అదిరిపోవడంతో ‘జై భీమ్’ ప్రేక్షకులను కదిలించేస్తుంది. జై భీమ్’ బాగా ఎంగేజ్ చేస్తుంది. ఇది చూడదగ్గ చిత్రమే కాదు.. ఒక బాధ్యతతో తప్పక చూడాల్సిన చిత్రం. న్యాయవ్యవస్థపై ఈ చిత్రం గౌరవాన్ని పెంచింది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…