Rashmika Mandanna : కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్న ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించింది. ఆ తర్వాత రష్మిక పలు సూపర్ హిట్ చిత్రాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. రష్మిక ఇప్పుడు సౌత్‌లోనే కాకుండా నార్త్‌లోనూ వరుస ఆఫర్స్ అందిపుచ్చుకుంటూ నేషనల్ క్రష్‌గా మారింది. టాలీవుడ్‌లో స్టార్ హీరోలందరితోనూ నటిస్తోంది రష్మిక. అల్లు అర్జున్‌తో పుష్ప చేసిన ఈ ముద్దుగుమ్మ.. గీత గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండతో జతకట్టింది. సరిలేరు నీకెవ్వరులో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ పక్కన కూడా నటించింది. ఇప్పుడు ఎన్టీఆర్ సరసన కూడా నటించబోతున్నట్టు తెలుస్తోంది.
రష్మిక రీసెంట్‌గా రెండు భారీ చిత్రాలకు సంతకం చేసింది. అవి రణబీర్ కపూర్ బాలీవుడ్ చిత్రం యానిమల్ , వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దళపతి విజయ్ కొత్త సినిమా. త్వరలో ఆమె పుష్ప 2 పనిని కూడా ప్రారంభించనుంది. అయితే అక్కడితో ఆమె ప్రస్థానానికి బ్రేక్ ఇవ్వదలుచుకోలేదు. కొత్త పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ కోసం ఆమెను మేకర్స్ సంప్రదించారట. దానికి కూడా రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. ఒకటి రెండు రోజుల్లో ఆ విషయాలపై క్లారిటీ రానుందని సమాచారం.
క్రేజీ ప్రాజెక్ట్స్‌లో భాగం కావడం పట్ల రష్మికని ప్రశ్నించగా, అందుకు స్పందించిన రష్మిక.. సినీ పరిశ్రమలో ఇప్పుడు నాకు మంచి సమయం నడుస్తోంది. క్రేజీ చిత్రాలలో నటిస్తున్నాను. ఇందులోని పాత్రలు ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. అందుకోసం ఈ సంవత్సరం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. నాతో పని చేస్తున్న నటీనటులు, దర్శకుల నుండి కొత్త విషయాలు కూడా నేర్చుకుంటున్నానని రష్మిక తెలిపింది. మరోవైపు యూవీ క్రియేషన్స్ టీమ్.. రామ్ చరణ్‌తో సినిమా చేయాలని ఎప్పటి నుండో అనుకుంటోంది. ఎట్టకేటకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో త్వరలో ఓ సినిమా రూపొందబోతోంది. ఈ సినిమాలో కూడా రష్మిక హీరోయిన్‌గా నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…