Balakrishna : నందమూరి బాలకృష్ణ మంచి స్పీడ్ మీదున్నారు. వరుస సినిమాలతో ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అఖండ చిత్రంతో భారీ హిట్ కొట్టిన బాలకృష్ణ ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాపై అభిమానులలో అంచనాలు భారీగానే ఉన్నాయి. త్వరలో అనిల్ రావిపూడితోనూ ఓ సినిమా చేయబోతున్నారు బాలకృష్ణ. అయితే ఇప్పుడు ఊహించని డైరెక్టర్‌తో బాలకృష్ణ ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ దర్శకుడు మరెవరో కాదు ఎస్వీ కృష్ణా రెడ్డి.
యమలీల 2 సినిమా తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టని కృష్ణారెడ్డి రీసెంట్‌గా సోహైల్‌తో సినిమా చేసేందుకు సన్నద్దమయ్యారు. కుటుంబ సమేతంగా చూడగలిగే సినిమాలు, మధ్యతరగతి విలువలు, బాధల్ని చెప్పే సినిమాలు తీస్తూ ఎన్నో విజయాలు అందుకున్న ఎస్వీ కృష్ణా రెడ్డి.. మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, అభిషేకం, యమలీల, శుభలగ్నం, మావి చిగురు, పెళ్ళాం ఊరెళితే, ఘటోత్కచుడు, యమలీల, ఎగిరే పావురమా.. లాంటి ఎన్ని హిట్ క్లాసిక్ సినిమాలతో ప్రేక్షకులని మెప్పించారు.
ఎస్వీ కృష్ణారెడ్డి కేవలం డైరెక్టర్ గానే కాక తన సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ గా, నటుడిగా, రచయితగా కూడా పని చేశారు. ప్రస్తుతం బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహైల్‌తో సినిమా చేస్తున్న ఆయన త్వరలో బాలకృష్ణతో ఓ మూవీ చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 1994లో టాప్ హీరో సినిమా కోసం ఈ ఇద్దరూ కలిసి పని చేశారు. ఇక రాఘవేంద్రరావుతో కూడా బాలకృష్ణ ఓ సినిమా చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై క్లారిటీ రావలసి ఉంది.
గతేడాది బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన అఖండ తో ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన తర్వాత వరుసగా క్రేజీ దర్శకులతోనే సినిమాలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఔట్ డేటెడ్ అయిపోయిన దర్శకుడితో సినిమా చేయనున్నట్టు వస్తున్న వార్తలని చదివి అందరూ షాక్ అవుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…