Jeevitha Rajasekhar : జీవితా రాజశేఖర్‌కి వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో ఎన్నో విషయాలలో హాట్ టాపిక్‌గా నిలుస్తూ అందరి దృష్టినీ ఆకర్షించింది జీవిత. తాజాగా జీవిత చెక్ బౌన్స్ కేసులో ఇరుక్కుంది. ఈమెపై కేసు పెట్టింది ఎవరో కాదు, జోస్టర్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హేమ. జోస్టర్ ఫిలిం సర్వీసెస్ నుంచి జీవితా రాజశేఖర్‌లు రూ.26 కోట్ల మేర అప్పు తీసుకుని ఎగ్గొట్టారని ఆరోపణలున్నాయి. గరుడ వేగ సినిమా కోసం జీవిత రాజశేఖర్‌లు అప్పు అడిగితే జోస్టర్ ఫిలిం సర్వీసెస్ తమ ఆస్తులు తాకట్టు పెట్టుకుని డబ్బు సర్దుబాటు చేసింది.
ఇప్పుడు ఆ ఆస్తులను బినామీల పేర్ల మీదకు మార్చుకుని జీవిత రాజశేఖర్‌లు మోసం చేసినట్లు జోస్టర్ ఎండీ ఆరోపించారు. జీవిత రాజశేఖర్‌లపై చెక్ బౌన్స్ కేసు నడుస్తోంది. ఈ కేసులో నగరి కోర్టు వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్లను జారీ చేసింది. కాగా ఈ ఆరోపణలను జీవితా రాజశేఖర్ లు ఖండించారు. మాపై కొందరు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. వీటిపై నేడు జరగబోయే శేఖర్ సినిమా విలేకరుల సమావేశంలో పూర్తి ఆధారాలతో స్పందిస్తాం. అప్పటి వరకు ఎటువంటి కథనాలను ప్రసారం చేయవద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం.. అని జీవితా రాజశేఖర్ లు మీడియాకు ఇచ్చిన ఒక ప్రకటనలో తెలిపారు.
2017లో రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన చిత్రం గరుడవేగ. ఈ చిత్ర నిర్మాణంలో జీవిత రాజశేఖర్‌లతో పాటు జోస్టర్ సంస్థ కూడా భాగమైంది. చిత్ర నిర్మాణం కోసం వారు రూ.26 కోట్ల ఆస్తులు అమ్మి మరీ ఇన్వెస్ట్ చేశారని, తీరా ఆ డబ్బులను జీవిత రాజశేఖర్ ఇవ్వలేదని జోస్టార్ హేమ తెలిపారు. అంతే కాకుండా జీవిత ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని ఆమె అన్నారు. మరి ఈ విషయంలో ఎవరిది తప్పు అనేది త్వరలోనే తేలనుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…