Rashmi Gautam : మన సమాజంలో ఎంతో మంది జంతు ప్రేమికులు ఉన్నారు. వారిలో యాంకర్ రష్మి గౌతమ్ ఒకరు. ఈమె మూగ జీవాలు బాధపడుతుంటే చూస్తూ తట్టుకోలేదు. వాటిని చిత్ర హింసలకు గురి చేసే వారిపై ఈమె ఆగ్రహం వ్యక్తం చేస్తుంటుంది. కరోనా సమయంలోనూ ఈమె మూగ జీవాలకు ఆహారం పెట్టి వాటి సంరక్షణ బాధ్యతలు చూసుకుంది. ఇక అప్పుడప్పుడు ఏవైనా వీధి కుక్కలు గాయపడితే ఈమె చికిత్సను అందిస్తుంటుంది. అంతేకాదు శునకాలను హింసకు గురి చేసేవారిపై ఫిర్యాదు కూడా చేస్తుంటుంది.
కాగా రష్మి గౌతమ్ తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో ఆమె జంతువులను ఏవిధంగా హింసిస్తున్నారో చెప్పుకొస్తూ బాధపడింది. డెయిరీ ఇండస్ట్రీలో పాల కోసం, పాల ఉత్పత్తుల కోసం సహజంగానే ఆవులు, గేదెలను హింసకు గురి చేస్తుంటారు. అలాంటి సంఘటనలపై రష్మి గౌతమ్ ఆవేదన వ్యక్తం చేస్తుంటుంది. అందులో భాగంగానే ఆవును ఈడ్చుకుని వెళ్తున్న ఒక ఫొటోను షేర్ చేసిన ఈమె తన కోపాన్నంతా బయటపెట్టింది.

మన దేశంలో గోమాత అంటూ ఆవులను పూజిస్తారు. కానీ ఇదేం దరిద్రమో.. అవే ఆవులను పాల కోసం హింసిస్తారు. వాటిని ఇబ్బందులు పెట్టకుండా ఉండలేరా.. అలాంటి జీవుల చర్మంతో తయారైన లెదర్ వస్తువులను మనం వాడతుంటాం. వాటికి బదులుగా ఇతర విధానాల్లో తయారు చేసిన వస్తువులను వాడవచ్చు కదా.. అంటూ రష్మి గౌతమ్ తన ఆవేదనను వెలిబుచ్చింది. ఈ క్రమంలోనే రష్మి పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.