Rashmi Gautam : జబర్దస్త్ యాంకర్ గా అందరికీ ఎంతో సుపరిచితమైన రష్మి గురించి అందరికీ తెలిసిందే. ఈమె ఒకవైపు జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తూనే మరోవైపు పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఇలా హీరోయిన్ గా నటిస్తున్న సమయంలో ఆమె తనను బెదిరించిందని తాజాగా ఓ నిర్మాత ఆమె విషయాలను బయటపెట్టారు. దీంతో ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలాజీ నాగలింగం అనే ఓ ప్రొడ్యూసర్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రష్మి గురించి విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనం ఒక వ్యక్తిని తిట్టాము అంటే వారి వల్ల మనం ఎంత బాధ పడి ఉంటామో అర్థం చేసుకోవాలి. ఈ విషయంలో కూడా అదే జరిగిందని తెలిపారు. రష్మి గుంటూరు టాకీస్ సినిమా చేస్తున్న సమయంలో శ్రీ లక్ష్మీ పిక్చర్స్ అనే సంస్థను ప్రారంభించి నేను నా స్నేహితుడు కలిసి రష్మి ప్రధాన పాత్రలో ఒక సినిమా చేయాలని భావించాము.
ఈ విధంగా రష్మితో ఆమె రెమ్యునరేషన్ గురించి అన్ని విషయాలు మాట్లాడి సినిమా మొత్తం షూటింగ్ పూర్తి అయ్యింది. ఇక చివరిలో ఒక సాంగ్, డబ్బింగ్ పార్ట్ మాత్రమే మిగిలి ఉంది. ఆ సమయంలో తాను షూటింగ్ కి రానని, హీరోని మార్చాలంటూ రష్మి డిమాండ్ చేసింది. ఆ సమయంలో తనతో మాట్లాడగా తనకు నాగబాబు తెలుసు, మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలుసు.. అంటూ వారి పేర్లు చెబుతూ నన్ను బెదిరించిందని ఆయన తెలియజేశారు.
నేను కూడా ఇండస్ట్రీలోనే ఉన్నవాడిని అని.. నాకు నాగబాబు , శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలియదా.. ఆ రోజు రష్మి నాతో మాట్లాడిన మాటలు అన్నీ నా దగ్గర రికార్డు చేయబడి ఉన్నాయి. అప్పుడు నేను రష్మిని ఫిలిం చాంబర్ గేటుకు కట్టేసి కొడతానన్న మాట నిజమే. నేను కేవలం నిజం చెప్పాలని మాత్రమే బెదిరించాను. నిజాయితీగా ఉండమని చెప్పాను.. అంటూ ఇంటర్వ్యూ సందర్భంగా బాలాజీ నాగలింగం రష్మి గురించి వెల్లడించారు. ఇలా చివరిలో పేచీ పెట్టుకున్న రష్మి మూడు నెలలపాటు షూటింగ్ కి రాలేదని, ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమెనే మళ్లీ వచ్చి షూటింగ్ కంప్లీట్ చేసిందని.. తెలిపారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఈయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…