Nayanthara : దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తన సినీ కెరీర్ లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగడమే కాకుండా నిత్యం ప్రేమ, బ్రేకప్ అంటూ పెద్దఎత్తున వార్తల్లో నిలిచింది. ఇక గత కొంతకాలం నుంచి నయనతార, డైరెక్టర్ విగ్నేష్ శివన్ ప్రేమలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. రహస్యంగా ప్రేమలో ఉన్న ఈ జంట తరచూ మీడియా కంటబడడంతో వీరి ప్రేమ విషయం బయటపడింది.
ఇలా వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి దేశవిదేశాలను తిరుగుతూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కరోనా లాక్ డౌన్ సమయంలో వీరిద్దరూ రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారని.. త్వరలోనే ఎంతో అంగరంగ వైభవంగా పెళ్లి కూడా చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇలా వీరి పెళ్లి గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ వీరి పెళ్లికి సంబంధించి ఇప్పటివరకు ఏ విధమైనటువంటి ప్రకటన చేయలేదు.
అయితే నయనతారకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూస్తే రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట పెళ్లి కూడా రహస్యంగా చేసుకున్నారని తెలుస్తోంది. తాజాగా తన ప్రియుడితో కలిసి తమిళనాడులోని ఒక అమ్మవారి ఆలయానికి వెళ్ళిన నయనతార తన నుదుటిపై సిందూరం పెట్టుకోవడంతో వీరిద్దరికీ రహస్యంగా పెళ్లి జరిగిందని.. ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా దాచేస్తున్నారని భావించిన నెటిజన్లు పెద్ద ఎత్తున ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే.. ఈ జంట ఈ విషయంపై స్పందించాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…