Paruchuri Venkateswara Rao : తెలుగు సినిమా ఇండస్ట్రీలో రచయితలుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న పరుచూరి బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పరుచూరి గోపాలకృష్ణ, పరుచూరి వెంకటేశ్వరరావు ఇద్దరూ ఎన్నో అద్భుతమైన సినిమాలకు రచయితలుగా పనిచేసి సినీ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు. వీరిద్దరూ 300 చిత్రాలకు పైగా రచయితలుగా పని చేయగా 200 చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. పరచూరి బ్రదర్స్ లో ఒకరైన వెంకటేశ్వర రావు గవర్నమెంట్ ఆఫీస్ లో ఉద్యోగం చేస్తూ.. సినిమాలకు రచన చేసేవారు.
ఈ విధంగా పరుచూరి బ్రదర్స్ కొన్ని దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో రచయితలుగా పని చేయడమే కాకుండా పలు సినిమాలలో కీలక పాత్రలలో కూడా నటించారు. అలాగే దర్శకులుగా కూడా పనిచేశారు. అయితే ఈ మధ్య కాలంలో పరుచూరి బ్రదర్స్ కొంతకాలం నుంచి ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇక అప్పుడప్పుడు పరుచూరి గోపాలకృష్ణ వీడియోల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినా వెంకటేశ్వరరావు మాత్రం పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అయ్యారు.
అయితే తాజాగా దర్శకుడు జయంత్ సి పరాంజీ.. పరుచూరి వెంకటేశ్వరావుని కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు అయ్యో గురువు గారు ఏంటి ఇలా అయిపోయారు అంటూ ఆయన వృద్ధాప్య స్థితిని చూసి షాక్ అవుతున్నారు. ప్రస్తుతం పరుచూరి వెంకటేశ్వరరావుకు సంబంధించిన ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. అయితే ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడం వల్లే ఇలా మారిపోయారని తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…