Rashi Khanna : తన అందం, అభినయంతో మంత్ర ముగ్ధులని చేసే అందాల ముద్దుగుమ్మలలో రాశీ ఖన్నా ఒకరు. ఊహలు గుసగుసలాడే సినిమాతో తొలి హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ వరుస ఆఫర్స్ అందుకుంటూ ముందుకు సాగుతోంది. జిల్, జోరు, బెంగాల్ టైగర్, హైపర్.. తొలిప్రేమ.. వరల్డ్ ఫేమస్ లవర్.. ప్రతిరోజు పండగే వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. మొదటి నుంచి ఎంతో సంప్రదాయబద్దంగా కనిపించే రాశీ ఖన్నా.. ఇప్పుడు ట్రెండ్ మార్చింది. గ్లామర్ షోలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ దూసుకుపోతోంది. సోషల్ మీడియాలోనూ అందాల ఆరబోతతో రచ్చ చేస్తోంది.
దాదాపు 9 ఏళ్ల తర్వాత రుద్ర వెబ్ సిరీస్‌తో హిందీ ప్రేక్షకులను పలకరించింది. అయితే కెరీర్ ఆరంభంలో తాను బాడీ షేమింగ్ ఎదుర్కోన్నానని.. బొద్దుగా ఉండడం వలన దక్షిణాది చిత్రపరిశ్రమ వాళ్లు తనపై కామెంట్స్ చేసేవారంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ. మొదట టాలీవుడ్ లో సక్సెస్ అయినప్పటికీ స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేదు. దాంతో కోలీవుడ్ లో సినిమాలు మొదలు పెట్టింది. అక్కడ కూడా నిరాశే ఎదురు అయ్యింది. కానీ ఇప్పుడు బాలీవుడ్ లో ఆఫర్లు రావడం తో ఇంతకాలం సినిమాలు చేసిన సౌత్ పైనే షాకింగ్ కామెంట్స్ చేసింది.
సౌత్ సినిమాలు చేస్తున్నంత కాలం రొటీన్ ఫార్ములా కు అలవాటు పడ్డా.. అని చెప్పింది. తనకు రొటీన్ పాత్రలు చేయడం ఇష్టం ఉండదు అని.. హీరోల పక్కన కాసేపు నటించడం ఆ తరవాత పక్కకి వెళ్లిపోవడం సౌత్ లో రోటీన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ ఆఫర్స్ వస్తున్నాయని సౌత్ పరిశ్రమపై ఆరోపణలు చేస్తున్నావా అంటూ తెగ ట్రోల్ చేశారు. ఈ క్రమంలో స్పందించిన రాశీ ఖన్నా.. బాడీ షేమింగ్ గురించి నేను చేసిన ప్రకటనను తప్పుగా అర్ధం చేసుకున్నారు.
నేను ఎవరినీ కించపరచలేదు.. అని స్పష్టం చేసింది. కాగా, దక్షిణాదిలో చాలా మంది నన్ను గ్యాస్ ట్యాంకర్ అని పిలిచేవాళ్లు. కొంతకాలం గడిచే సరికి సన్నగా మారాలని నిర్ణయించుకున్నాను.. ఫిట్ అయ్యాను. నేను చేస్తున్న వృత్తికి నాజుగ్గా ఉండడం ఎంతో అవసరమని అర్థమైంది. అందుకే సన్న బడ్డాను… అంతేకానీ వాళ్ల నోర్లు మూయించాలని కాదు.. సోషల్ మీడియాలోనూ ఇలాంటి విమర్శలు ఎదురైనప్పటికీ నేను ఏమాత్రం బాధపడలేదు.. అంటూ చెప్పుకొచ్చింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…