Rashi Khanna : విక్రమ్ కుమార్ దర్శకత్వంలో దిల్ రాజ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం.. థాంక్ యూ. ఇందులో నాగచైతన్య హీరోగా నటిస్తుండగా.. ఆయన పక్కన రాశీ ఖన్నా హీరోయిన్‌గా చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.
ఇందులో భాగంగానే తాజాగా రష్యాలో మంచు వాతావరణంలో ఈ మూవీకి చెందిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నారు. మనం సినిమా ఫేమ్ విక్రమ్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
రష్యా రాజధాని మాస్కోలో ప్రస్తుతం వీధుల్లో మంచు కురుస్తోంది. ఆ వాతావరణంలో ఈ చిత్రానికి చెందిన పలు ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే రష్యా మంచు వాతావరణంలో నాగచైతన్య, రాశీ ఖన్నా ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కొన్ని ఫొటోలను రాశీ ఖన్నా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఈ సందర్భంగా రాశీ ఖన్నా మాట్లాడుతూ.. ఎముకలు కొరికే గడ్డ కట్టించే చలిలో మైనస్ 14 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో చిత్ర షూటింగ్ జరుగుతుందని తెలియజేసింది. థాంక్ యూ చిత్రం ఈ ఏడాది వేసవిలో విడుదల కానుంది. ఇందులో నాగచైతన్య ఓ కార్పొరేట్ యువకుడిగా కనిపించనున్నాడు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…