Ramya Krishnan : టాలీవుడ్ లో అలనాటి హీరోయిన్ రమ్యకృష్ణ అందరికీ సుపరిచితమే. ఎన్నో చిత్రాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. రమ్యకృష్ణ ఒక తమిళ అమ్మాయి అయినప్పటికీ తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇక ఎంతోమంది టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించింది. కొన్ని సినిమాల్లో విలన్ పాత్రల్లో కూడా ఆకట్టుకుంది రమ్యకృష్ణ. ఇక బాహుబలిలో శివగామి పాత్రలో అద్భుతమైన నటనను ప్రదర్శించి రీఎంట్రీ ఇచ్చింది. దీంతో ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగిపోయిందని చెప్పవచ్చు.
తాజాగా రమ్యకృష్ణ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ తల్లిగా మాస్ నటనతో అదరగొట్టింది. ఇక ఈ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది రమ్యకృష్ణ. 1990లో కూడా రమ్యకృష్ణ తన హాట్ అందాలతో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిందని చెప్పవచ్చు. రమ్యకృష్ణకు సంబంధించిన అప్పటి హాట్ ఫోటోలు ఇటీవల వైరల్ ఆయిన విషయం తెలిసిందే. అప్పట్లోనే తన అంద చందాలతో ఎంతోమంది కుర్రకారును ఆకట్టుకుంది. అయితే తాజాగా ఆమె అందాల ప్రదర్శన పీక్స్‌కు చేరుకుంది.

ఎద అందాలు ఎగిసిపడుతున్నట్టుగా చీరకట్టులో కనిపించింది. ప్రస్తుతం రమ్యకృష్ణ ఈ చీరలో చేసిన ఫోటో షూట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ వయసులో కూడా మేడమ్ సూపర్ గా ఉన్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. రమ్యకృష్ణ డైరెక్టర్ కృష్ణవంశీని ప్రేమించి వివాహం చేసుకుంది. ఇక వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోతున్నారనే వార్తలు కూడా వినిపించాయి.. కానీ ఈ వార్తలపై ఇటీవల డైరెక్టర్ కృష్ణవంశీ క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీంతో ఈ రూమర్స్ కు చెక్ పడిందని చెప్పవచ్చు. ప్రస్తుతం రమ్యకృష్ణ హాట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.