Ram Charan Tej : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రమోషన్స్‌తో బిజీగా ఉంటూ వస్తున్నారు. ఫ్యామిలీకి దూరంగా ఉంటూ ఆయన కొద్ది రోజులుగా ప్రమోషన్స్‌తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. తాజాగా చరణ్ ఓ ఫుడ్ ఛాలెంజ్లో పాల్గొన్నారు. ఇందులో ఆర్ఆర్ఆర్ సినీ విశేషాలతోపాటు.. తనకు ఇష్టమైనన ఫుడ్ గురించి కూడా పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు.
తన తాత అల్లు రామలింగయ్య గురించి మాట్లాడుతూ.. తన తాత స్వాతంత్య్ర సమరయోధుడని చెప్పిన చెర్రీ.. ఆ రోజుల్లో ఆయన హక్కులపై పోరాటం చేశారని, ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసని తెలిపారు. ఆ పోరాటంలో ఆయన జైలు పాలయ్యారని, 15 రోజులకు పైగా ఆయన్ని జైలులో ఉంచారని తన కుటుంబ సభ్యుల్లో కూడా కొద్ది మందికి మాత్రమే తెలుసంటూ ఓపెన్ అయ్యారు.
ఇక ఫుడ్ గురించి మాట్లాడుతూ.. మా ఇంట్లో ఎక్కువగా స్పైసీ తినేది నేనే. కేవలం ఇవే కాకుండా అన్నింటినీ ఎంజాయ్ చేస్తాను… అలా అని నేను భోజన ప్రియుడిని కాదు. నాన్ వెజ్ కంటే వెజ్ ఎక్కువగా ఇష్టపడతాను.. హైదరాబాద్ బిర్యానీ ఇష్టం. కాస్త సమయం ఉన్నా అప్పుడప్పుడు వంట చేస్తాను. ఇక మా ఇంట్లో ఫేమస్ చిరు దోశ గురించి కూడా నాకేమీ తెలియదు.. అందులో ఉపయోగించే పదార్థాల గురించి అమ్మ ఎప్పుడూ చెప్పలేదని చెప్పుకొచ్చారు చరణ్.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…