Shanmukh : బిగ్ బాస్ సీజన్ 5 రన్నర్ షణ్ముఖ్ బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నన్ని రోజులు తెగ వార్తలలో నిలుస్తూ వచ్చాడు. ముఖ్యంగా సిరితో అతను ప్రవర్తించిన తీరు హాట్ టాపిక్‌గా మారేలా చేసింది. సిరితో రిలేషన్, పదేపదే హగ్గులతో విపరీతమైన నెగిటివిటీ మూటగట్టుకున్నాడు. హౌస్‌లోకి వచ్చే ముందే సిరికి శ్రీహాన్‌తో ఎంగేజ్‌మెంట్ జరగడం, షణ్నూ.. దీప్తి సునయనతో రిలేషన్ షిప్‌లో ఉండటంతో వారి ప్రవర్తన జనాలకు అస్సలు మింగుడు పడలేదు. దారుణంగా ఈ ఇద్దరినీ ట్రోల్ చేశారు.
బిగ్బాస్ టైటిల్ రేసులో ఉన్న షణ్ముఖ్ ఆ తర్వాత.. సిరితో స్నేహం.. శ్రుతి మించిన హగ్గులతో తనను మరింత దిగజార్చుకున్నాడు. అయితే హౌజ్‌లో ఉన్నన్ని రోజులు జంట పాములుగా కనిపించిన ఈ జంట బయటకు వచ్చాక ఫ్రెండ్స్ అని చెప్పారు. ఇక షన్నూ అయితే రూమర్స్ రావడం కొత్తేమీ కాదంటూ ఇప్పుడు తెల్చీ చెప్పేశాడు. తాజాగా తన ఇన్ స్టా లైవ్ లోకి వచ్చిన షణ్ముఖ్.. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు.
ఓ నెటిజన్ దీప్తి సునయన గురించి అడగడంతో బ్రేకప్ గురించి క్లారిటీ ఇచ్చాడు షన్నూ. ప్రస్తుతం తనను బ్లాక్ చేసిందని.. కోపం వచ్చినా.. అలిగినా ఇలాగే బ్లాక్ చేస్తుందని.. త్వరలోనే హైదరాబాద్ వెళ్లి తనను కలుస్తానని చెప్పుకొచ్చాడు షణ్ముఖ్. దీప్తి నా వల్ల చాలా నెగెటివిటీని ఫేస్ చేసింది. అయినా నా కోసం నిలబడింది. తప్పకుండా వెళ్లి మాట్లాడతాను. నా చేతి మీద ఉన్న పచ్చబొట్టు పోయేంత వరకు దీపును వదలను అంటూ చెప్పుకొచ్చాడు షణ్ముఖ్.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…