Vijay Devarakonda : రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమాలతోనే కాకుండా సేవా కార్యక్రమాల ద్వారానూ ప్రజల మనసులు గెలుచుకుంటున్నాడు. గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన రౌడీ బాయ్ ఈ క్రిస్మస్ కి మరో 100 మందికి సహాయం చేయడానికి రెడీ అయ్యాడు. 100 మందికి రూ.10వేల చొప్పున రూ.10 లక్షల సహాయం ప్రకటించాడు. జనవరి 1న 100 మందికి ఆ డబ్బులు ఇస్తానని తెలిపాడు.
పండుగ చేసుకోలేని వారు, అత్యవసర అవసరం ఉన్నవారు మాత్రమే ఈ సహాయం అందుకోవాలని కోరాడు విజయ్. దీని కోసం ఓ ఫార్మాట్ ను కూడా ప్రకటించాడు రౌడీ హీరో. సహాయం కావాల్సిన వారు వాళ్ల మెయిల్ ఐడీ నుంచి రౌడీ క్లబ్ లో రిజిస్టర్ కావాలని సూచించాడు. అందరి పేర్లను.. వాళ్ల వివరాలను నిశితంగా పరిశీలించి 100 మందిని ఎంపిక చేస్తానని తెలిపాడు. జనవరి 1వ తేదీన 100 మంది వ్యక్తులకు ఒక్కొక్కరికి రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అందులో 50 మంది నా అభిమానులు ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి రౌడీ కోడ్ అండ్ రిజిస్టర్డ్ ఐడీని ఎంటర్ చేయండి” అని చెప్పుకొచ్చాడు.
విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో `లైగర్` చిత్రంలో నటిస్తున్నాడు. చిత్రీకరణ కూడా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సినిమా హిట్ అయితే విజయ్ రేంజ్ అంతకంతకూ పెరిగిపోతుందనడంలో సందేహం లేదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…