Rakul Preet Singh : దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తనదైన శైలిలో దూసుకుపోతోంది. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ఎక్కువగా తన ఆరోగ్య విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పవచ్చు. ఎక్కువగా తన ఆరోగ్యంపై దృష్టి సారించే రకుల్ నిత్యం కఠిన వ్యాయామాలు చేస్తూ తన శరీర ఫిట్‌నెస్ గురించి జాగ్రత్త పడుతూ ఉంటుంది.

ఇలా ఆరోగ్య విషయంలోనూ, గ్లామర్ విషయంలో ఏమాత్రం రాజీ పడని ఈ బ్యూటీ తన గ్లామర్ సీక్రెట్ ఏంటో బయటపెట్టేసింది. ఈమె గ్లామర్ సీక్రెట్ అంటే.. జిమ్, యోగ అని మాత్రమే మనకు తెలుసు. అయితే అసలైన తన గ్లామర్ సీక్రెట్ ఏంటి అనే విషయానికి వస్తే.. అది పెరుగన్నం అని రకుల్ ప్రీత్ సింగ్ తెలియజేసింది.
తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ పెరుగన్నం తింటూ ఉన్న ఒక ఫోటోను షేర్ చేస్తూ..పెరుగులో ఉండే ప్రత్యక్ష సూక్ష్మజీవులు, చియాలోని ఫైబర్ నా కడుపును ఎంతో ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతాయి.. అంటూ చెప్పుకొచ్చింది. పెరుగు అన్నం తిన్న తర్వాత తనకు ఎంతో తేలికగా, ఉల్లాసంగా ఉంటుందని.. అదేవిధంగా పెరుగన్నం తినటం వల్ల తన అందం కూడా పెరుగుతుందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. ఇక సినిమాల విషయానికొస్తే ఈమె వైష్ణవ్ తేజ్ సరసన కొండపొలం అనే సినిమాలో నటించింది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.